Bjp president kishanreddy takes on cm kcr

Kishan reddy, bjp state president, Telangana CM, KCR, telangana liberation day

BJP president Kishanreddy Takes on CM KCR, asks to choose whom he want telangana pupil or Razakars

రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకో..

Posted: 09/17/2014 01:43 PM IST
Bjp president kishanreddy takes on cm kcr

రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ సీఎంగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.

మహారాష్ట్ర, కర్ణాటకలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రా దినోత్సవాలను అధికారికంగా జరుపుతున్నా... ఇక్కడ ఎందుకు జరపడం లేదని కేసీఆర్ను ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోచ్చిన వ్యక్తిగా చెప్పకునే కేసీఆర్..  ముఖ్యమంత్రి అయినా తన హయంలో ఎందుకు విమోచన దిన్సోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ఎవరు వద్దన్నా... కాదన్నా... గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ ... తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజగా ఆయన అభివర్ణించారు.

అనంతరం పార్టీ నేతలు, శ్రేణులతో గొల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి బాపు ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కోటకు ర్యాలీగా బయలుదేరి వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కోటకు వెళ్లే అన్ని దారుల వద్దా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కోటలో జెండా ఎగురవేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.  అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా అధికారిక ప్రకటన చేసేంతవరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్ఫష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles