Because of trs metro rail works stopped alleges revanth reddy

revanth reddy, revanth reddy daughter, revanth reddy wife, revanth reddy family, revanth reddy wiki, revanth reddy comments on kcr, revanth reddy on trs leaders, latest news, metro rail, hyderabad metro rail, l and t company, l and t metro rail, kcr, telangana, trs leaders, metro rail route map

revanth reddy alleges trs leaders grief and restrictions on l and t company stopped metro rail works : trs have no clarity and vision on metro rail hyderabad, party leaders and government forcebly tries to occupy lands allocated to metro rail says revanth reddy

టీఆర్ఎస్ దురాశవల్లే మెట్రోరైలు ఆగింది !

Posted: 09/17/2014 01:40 PM IST
Because of trs metro rail works stopped alleges revanth reddy

టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ సారి మెట్రో అంశంగా... అస్ర్తంగా ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతల దురాశ వల్లే మెట్రో పనులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని ప్రభుత్వం.., ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం వల్లే ఇలా జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి స్పష్టత, అవగాహన లేదన్నారు. రైలు అలైన్ మెంట్ మార్చాలని సీఎం మొండిపట్టుతో ఉన్నారని.. ఇది ఖర్చుతో కూడుకున్న పనితో పాటు.., ప్రమాదకరమైనదిగా అధికారులే చెప్తున్నా విన్పించుకోవటం లేదని ద్వజమెత్తారు. దీని వల్ల పనులు ఆలస్యం అయి, ఫలితంగా ప్రభుత్వమే అదనపు ఖర్చును భరించాల్సి వస్తోందని విమర్శించారు.

ఇక మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్గిస్తోందన్నారు. చివరకు గచ్చిబౌలిలో కేటాయించిన స్థలాన్ని కూడా తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దురాశపర చర్యల వల్లే విసుగుచెందిన ఎల్&టి రైలు పనులు చేపట్టలేమని ప్రకటించారని మండిపడ్డారు. తెలంగాణ మణిహారంగా., అభివృద్ధిలో కీలకం అయిన మెట్రో రైలుపైనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే.., రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం ఏ మేర చిత్తశుద్ధి చూపిస్తుందో తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ విమర్శలు చేశారు.

మెట్రో రైలు పనులు తాము చేపట్టలేమని ఎల్&టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలుకు లేఖ రాసింది. పెరిగిన వ్యయం, రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో పరిస్థితులు ఇతర కారణాల వల్ల తాము ప్రాజెక్టును చేపట్టలేమని లేఖ రాసింది. దీంతో దేశంలోనే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న తొలి రవాణా వ్యవస్థ పనులకు ఆటంకం ఏర్పడినట్లయింది. సంస్థ రాసిన లేఖలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ వివరించింది. ఒప్పందం జరిగిన సమయంలో ప్రభుత్వం తమకు సహకరిస్తామని మాట ఇచ్చిందనీ.., ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తమకు ఇబ్బందులు కల్గిస్తోందని ఎల్&టీ ఆరోపించింది. భూముల కేటాయింపులో ఆలస్యం చేయటంతో పాటు అలైన్ మెంట్ మార్చాలని పట్టుబట్టడం తీవ్ర ఇబ్బందికరంగా చెప్పింది. రూటు లైను మార్చితే.., తమకు అధిక వ్యయం కావటంతో పాటు., భూగర్భ జలాలు తగ్గిపోవటం.., రైలు మార్గంలోని నిర్మాణాలకు ముప్పు ఏర్పడుతుందని అధ్యయనంలో తేలిందన్నారు. అయినా సరే ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోటం బాధాకరమని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.

విభజన ప్రభావం పడింది

ఇక రాష్ర్ట విభజన ప్రభావం రైల్వే నిర్మాణంపై స్పష్టంగా పడిందన్నారు. ఒప్పందం జరిగిన సమయంలో హైదరాబాద్ 23 జిల్లాలకు రాజధాని కాగా.., ఇప్పుడు కేవలం 10 జిల్లాలు గల చిన్న రాష్ర్టానికి రాజధాని అని ఫలితంగా ఇక్కడకు వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. అటు నగరంలోని కంపనీలు, ఫ్యాక్టరీలు ఆంద్రప్రదేశ్ కు తరలిపోవటంతో పాటు అక్కడ కూడా కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ కు వచ్చే అవసరం ఉండదని చెప్పారు. దీనికి తోడు విభజన జరిగినా హైదరాబాద్ పరిస్థితులను బట్టి నగరం ఉమ్మడి రాజధానిగా లేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని భావించి ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చామని లేఖలో వివరించారు. అయితే కేవలం తెలంగాణకు రాజధాని కావటం వల్ల మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు పెట్టే  కంపనీల సంఖ్య తగ్గుతుందన్నారు.

కేవలం టికెట్ చార్జీల ఆధారంగా రైళ్లను నడపలేమని వివరించారు. అందువల్లే తాము ప్రాజెక్టు నిర్మాణం నుంచి తప్పుకోవాలనుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డికి లేఖ ఎల్&టీ మెట్రో రైలు విభాగం తరపున వివేక్ గాడ్గిల్ లేఖ రాశారు. ఇప్పటి వరకు చేసిన పనులకు, చట్ట పరంగా తమకు రావాల్సిన డబ్బులు ఇస్తే నిర్మొహమాటంగా పనుల నుంచి తప్పుకుంటామని ఆయన ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఒక తేదిని, వేదికను ఖరారు చేసి చెప్పాలని కోరారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  metro rail  revanth reddy  latest news  

Other Articles