Jammu kashmir rescue operations going on over 500000 people still wait for help in flood ravaged

jammu kashmir, rescue operations, latest news, jammu rains, kashmir, jammu snow, india, pakisthan border, indian air force, army, defence, rescue operations, floods, rains

rescue operations in jammu kashmir is going on still lakhs of people on stranded : iaf, army doing rescue opetations in flood effected jammu kashmir death toll raises near 200

అంధకారంగా మారిన అందాల కాశ్మీర్!

Posted: 09/11/2014 04:51 PM IST
Jammu kashmir rescue operations going on over 500000 people still wait for help in flood ravaged

భారతదేశ స్వర్గవిహార ప్రదేశంగా పరిగణించబడే జమ్మూకాశ్మీర్ ప్రదేశం... నేడు వరదల భీభత్సం ధాటికి అంధకారంగా మారిపోయింది. అప్పటివరకు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రజలు... వరదల దెబ్బకు నరకయాతన అనుభవిస్తున్నారు. కాశ్మీరం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ దారుణమైన సంఘటనలో ఎన్నో పసిప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంకా కొట్టుకుపోతూనే వున్నారు. ఈ ఘటన నుంచి బయటపడ్డ మరికొంతమంది సరిగ్గా తిండ లేక ఎన్నో కష్టాలను ఎదుర్కుంటున్నారు. భోజనం కాదు కదా.. కనీసం నీళ్లు కూడా వారికి దొరకడం లేదు. ఇదిలావుండగా.. ఈ వరద భీభత్సం వల్ల లక్షలమంది నిరాశ్రయులయ్యారు. వీరి ఆచూకీ కోసం జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా ఈ వరదల్లో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం వేగవంతంగా గాలింపు చర్యలను చేపట్టారు.

కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృత తగ్గినప్పటికీ ఇంకా చిక్కుకునిపోయి వున్న జనాలను కాపాడేందుకు ఆర్మీ జవాన్లు, ఇతర అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోని ఒక ప్రాంతంలో దాదాపు 2000మంది వరకు చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మిలిటరీ టీమ్ వాళ్లు కేవలం ఒక్క శ్రీనగర్ ప్రాంతం నుంచి సుమారు 807 మందిని కాపాడగలిగారు. ఇలా ఈ విధంగా నిర్వహించిన రకరకాల ఆపరేషన్ల నేపథ్యంలో దాదాపు 82,000 మంది ప్రజల్ని ఈ వరద భీభత్సం నుంచి కాపాడగలిగారు. మల్టీ ఏజెన్సీ మమోత్ ఆపరేషన్ లెక్కల ప్రకారం.. ఇంకా ఐదు నుంచి ఆరు లక్షల మంది ఈ భీభత్సంలో ఇరుక్కుపోయి వుంటారని అంచనా వేస్తున్నారు. వారికి ఇంకా ఆహారం, నీళ్లు సహాయం కూడా అందలేదని వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ జనరల్ హూడా మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే శ్రీనగర్ లో వరద ఉధృత చాలావరకు తగ్గిపోయింది. ప్రస్తుతం నీళ్లు 6 అడుగుల ఎత్తుకు చేరుకుందని.. అయితే మరికొన్ని ప్రాంతాల్లో దీని ఉధృత ఇంకా తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 807 టన్నుల వివిధ రకాల ఆహార పదార్థాలను ఈ భీభత్సంలో చిక్కుకున్న ప్రజలకు సర్వ్ చేయడం జరిగిందని ప్రభుత్వం తెలుపుతోంది. ఇంకా ఎవరికైతే ఆహారపదార్థాలు చేరలేదో వారికి అందించడం కోసం ఆర్మీ జవాన్లు చాలా కష్టపడుతున్నారని ఆయన వెల్లడించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం ఆహార, నీళ్ళ ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ప్రధానంగా శ్రీనగర్, దక్షిణ కాశ్మీర్ లోని ముంపు ప్రాంతాల్లో ఇంకా లక్షల మంది వరదల్లో చిక్కుకుని ఉంటారని ఆర్మీ భావిస్తోంది. వీరందర్నీ రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్మీ, వైమానిక దళాలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. అటు ఈ వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 200కు చేరువ అవుతోంది. వరదల భీభత్సానికి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. వీరిలో పలువురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూలో వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయని అధికారులు అంటున్నారు. ప్రవాహం తగ్గటంతో ఇప్పుడిక ప్రజలకు పునరావాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించామని చెప్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ రక్షించే వరకు సైనికులు క్యాంపులకు వెళ్లరని ఆర్మీ చీఫ్ దల్బీర్ సుహాగ్ తెలిపారు.

గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా వరదలు రావటంతో కాశ్మీర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రధాన ఆదాయవనరైన టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. ఇక సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. వందలాది గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వీటన్నిటిని పునరుద్దరించటం కష్టంతో కూడుకున్న పని. కాశ్మీర్ విలయంను ఆదివారం ప్రత్యక్షంగా చూసిన ప్రధాని మోడి ఆదుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  floods  army rescue operations  latest news  

Other Articles