India successfully test fires n capable agni i missile

india, Agni-! missile, Prithvi, odisha, Bhuvaneshwar, Bhadrak district, Army

india Test fires its indigenously developed nuclear-capable surface-to-surface Agni-I missile

విజయవంతమైన అగ్ని-1 క్షిపణి ప్రయోగం

Posted: 09/11/2014 03:40 PM IST
India successfully test fires n capable agni i missile

భారత్ తన అమ్ములపోదిలోని అగ్ని-1 క్షిపణి ప్రయోగ పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. భూ ఉపరితల లక్ష్యాలను చేధించి.. నిర్వీర్యం చేయగలిగే సత్తా వున్న అగ్నీ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపోందించారు. 700 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్యాలను చేధించ సామర్థ్యం అగ్ని-1 క్షిపణికి వుంది. దీంతో పాటు టన్ను బరువున్న అణ్వస్త్రాలను కూడా ఈ క్షిపణి తీసుకువెళ్లగలదు. డిఫెన్స్ అధికారులు పర్యవేక్షణలో సాగిన ఈ ప్రయోగ పరీక్షను ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ పట్టణ్ణంలోని భద్రక్ జిల్లాకు 170 కిలోమీట్లర్ల దూరంలోని ధర్మ వద్ద ప్రయోగాన్ని ఆర్మీ అధికారులు పరీక్షించారు.
ప్రయోగం విజయవంతం అయ్యిందని టెస్ట్ రేంజ్ అర్మీ అధికారి ఎంవీకేవీ ప్రసాద్ ప్రయోగం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇది ఖచ్చితమైన ప్రయోగమని ఆయన పేర్కొన్నారు. మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణైన అగ్ని-1, నిర్థేశిత లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేధించగలదన్నారు. ఈ అగ్ని క్షిఫణికి ఘన చోదక బూస్టర్ అమర్చామని ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  agni-1 missile  Prithvi  

Other Articles