Jammu kashmir rains rescue operations going on

jammu kashmir, jammu rains, kashmir rains, jammu kashmir disaster, death toll, rains, army, iaf, airforce, rescue operations, narendra modi, omer abdullah, national crisis

rescue operations in jammu kashmir going in war face : army, iaf in jammu rescue operations central announced rs.1000crores for relief death toll raises above 150

జమ్మూ వర్షాలు జాతీయ విపత్తుగా ప్రకటన

Posted: 09/08/2014 12:24 PM IST
Jammu kashmir rains rescue operations going on

జమ్మూలో వరద భీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు హిమాలయ రాష్ర్టాన్ని ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు వచ్చి వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటు వరదలతో ఇప్పటివరకు 150కి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. భవంతులు సైతం నీట మునిగాయి.., వంతెనలు కొట్టుకుపోయాయి. చల్లగా ప్రశాంతంగా ఉండే కాశ్మీరం వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ర్టాన్ని ఇప్పట్లో కోలుకోలేని విధంగా వరుణుడు నాశనం చేశాడు.

జాతీయ విపత్తుగా ప్రకటన

వరద భీభత్సంపై స్పందించిన ప్రధాని నరేంద్రమోడి ఆదివారం కాశ్మీర్ లో పర్యటించారు. వర్షం నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. రాష్ర్టానికి తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు ప్రకటించారు. అంతేకాకుండ జమ్మూ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్రం ఎఫ్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆర్మీ, వైమానిక దళాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను ఆర్మీ, వైమానిక యుద్ద హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

వరదలతో రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినటంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సమాచార చేరవేత నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్భందంలో ఉన్నాయి. శ్రీనగర్ సచివాలయం, హైకోర్టు కూడా ఏకంగా ఎనమిది అడుగుల లోతు నీటిలో మునిగిపోయి ఉన్నాయంటే వరదల నష్టం ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లతున్నాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వరదలు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నాయి. ఆక్రమిత కాశ్మీర్ లో కూడా వరదలు భీభత్సం సృష్టించాయి. అక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు భారత్-పాక్ సంసిద్ధత వ్యక్తం చేశాయి. గత రెండు దశాబ్దాల కాలంలో రాష్ర్టంలో ఇవే భీకర వరదలుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir rains  disaster  national crisis  latest news  

Other Articles