Supreme court put stay on surender koli hanging

supreme court, stay order, noida serial murders, nithari murders, surender koli, latest news, meerut jai, uttar pradesh, payal, supreme court judgements, children, missing cases

supreme court given stay order on surender koli hanging : noida serial murders convicted koli hanging stayed for 1week by supreme court orders

ఉరికి అన్ని సిద్ధం చేసుకోగా స్టే ఇచ్చిన కోర్టు

Posted: 09/08/2014 11:34 AM IST
Supreme court put stay on surender koli hanging

దేశంలో సంచలనం రేపిన నోయిడా జంట హత్యల కేసు దోషి సురేందర్ కోలి ఉరిశిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. వారం రోజుల పాటు స్టే విధిస్తూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోలిని ఉరి తీసేందుకు  జైలు అధికారులు సిధ్ధమైన చివరి క్షణంలో ఆదేశాలు వచ్చాయి. కోలి క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ర్టపతి తిరస్కరించటంతో ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు, కొక్కెం తెప్పించారు. సోమవారం ఉదయం ఉరితీసే అవకాశముందని జైలు అధికారులు తెలిపారు. ఈ లోగా కోర్టు స్టే కాపి అందటంతో శిక్ష అమలును ఆపేశారు.

దారుణమైన ఈ కేసును చూస్తే.., దోషి అయిన సురేందర్ కోలి నోయిడాలోని నిఠారి ప్రాంతంలో ఓ ఇంట్లో పనిచేసేవాడు. సమీప ప్రాంతాల్లో ఉండే చిన్నారులు వరుసగా అదృశ్యం అవుతుండటంతో స్థానికులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఈ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేశారు. ఓ రోజు సురేందర్ కోలి పనిచేసే ఇంటి వెనక ఉన్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో స్థానికులకు ఎముకలు కన్పించటంతో ఘోరం వెలుగులోకి వచ్చింది. కన్పించకుండా పోయిన చిన్నారుల మృతదేహాలే అందులో ఉన్నాయని బాదిత కుటుంబాలు ఆరోపించాయి. పోలిసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్నారు.

ట్యాంకు నుంచి మొత్తం 17 మృతదేహాలకు చెందిన ఎముకలు లభ్యమయ్యాయి. వీటిలో 10 అమ్మాయిల మృతదేహాలు కాగా, మిగతావి అబ్బాయిలవి. లభ్యమైన మృతదేహాల్లో ఒక్కటి మాత్రమే యువతిగా గుర్తించారు. మిగతావన్ని పదేళ్ళలోపు చిన్నారుల మృతదేహాలు. ఈ హత్యలకు పోలిసుల నిర్లక్ష్యమే కారణంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విచారణకు వచ్చిన పోలిసులపై బాధిత కుటంబాలు దాడులు కూడా చేశాయి. దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపటంతో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసింది.

పోలిసుల నిర్లక్ష్యంతో పాటు, కోలి పాశవిక హత్యలపై కమిషన్ విచారణ జరిపింది. పూర్తిగా పోలిసులు నిర్లక్ష్యం వహించారని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఈ కేసు గురించి దుమారం రేగటంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఎస్పీలు, ఆరుగురు పోలిసులు సస్పెండ్ అయ్యారు. కోలిని అదుపులోకి తీసుకున్న పోలిసులు.., విచారించగా నేరం అంగీకరించాడు. చిన్నారులందర్ని తానే చంపినట్లు అంగీకరించాడు. హత్యలు చేసిన విధానం విన్న పోలిసులు భయపడిపోయారు. కోలి నరరూప రాక్షసత్వం తెలిసి ధర్యాప్తు బృంద అధికారులు అవాక్కయ్యారు.

కోరిక తీర్చుకుని ముక్కలుగా కోసేవాడు

విచారణలో పోలిసులకు చెప్పిన వివరాల ప్రకారం.., చిన్నారులను అపహరించిన తర్వాత తన రూంలో బంధించేవాడు. లైంగికంగా వారిని హింసించి.., కోరిక తీర్చుకునేవాడు. ఆ తర్వాత అతి దారుణంగా గొంతు పిసికి హత్య చేసి.., బాత్ రూంలో ముక్కలు ముక్కలుగా శరీరాన్ని కోసేసి... సంచిలో వేసుకుని ట్యాంకులో పడేసినట్లు చెప్పాడు. ఇది విన్న విచారణ అధికారులు వణికిపోయారు. కోలి ఇంతటి రాక్షసుడా అని భయపడ్డారు. కోలి చేసిన నేరాలను నిరూపించుకునేందుకు అతనికి బ్రెయిన్ మ్యాపింగ్, పాలి గ్రాఫ్ టెస్టులు నిర్వహించారు.

కోలి చేసిన నేరాలు రుజువు కావటంతో కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. పోలిసుల తీరును కూడా తప్పుబట్టింది. కోర్టు తీర్పు ప్రకారం సురేందర్ కోలిని మీరట్ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం ఉరి తీయాల్సి ఉండగా తిరిగి సుప్రీం కోర్టే వారం రోజులు స్టే విధించింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  surender koli  noida serial murders  latest news  

Other Articles