Tdp minister revanth reddy controversial comments on telangana cm kcr

revanth reddy, tdp minister revanth reddy, cm kcr, cm kcr latest news, revanth reddy fires cm kcr, kcr latest press meet, revanth reddy latest press meet, telangana ministers, trs party leaders

tdp minister revanth reddy controversial comments on telangana cm kcr

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే.. కేసీఆర్ ను పక్కనపెట్టండి!

Posted: 09/06/2014 12:07 PM IST
Tdp minister revanth reddy controversial comments on telangana cm kcr

(Image source from: tdp minister revanth reddy controversial comments on telangana cm kcr)

తెలంగాణ ప్రాంతవాసులు తమతమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే.. తమకంటూ ఒక సొంతరాష్ట్రం వుండాల్సిందేనని టీఆర్ఎస్ పార్టీ విభజనకు ముందు ఎన్నో ఉద్యమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే! దీంతో తెలంగాన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘‘మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి... స్వేచ్ఛగా జీవించే హక్కు మాకుంది... మా రాష్ట్రం మాకిచ్చేయండి’’ అంటూ తెలంగాణ ప్రజలు అందరూ ఒకేసారి గళం విప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇక్కడి ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్ఎస్ పార్టీయేనంటూ మద్దతుగా ఆ పార్టీకి భారీగా ఓట్లు వేసి గెలిపించారు కూడా! ఒకవిధంగా చెప్పాలంటే.. టీఆర్ఎస పార్టీ ఆత్మగౌరవం అనే ఒకేఒక్క పదాన్ని ఉపయోగించుకుని నేడు అధికారంలోకి వచ్చిందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా..? నేడు రాజకీయ రణరంగంలో ‘‘ఆత్మగౌరవం’’ అనే పదం పెద్ద దుమారంగా మారిపోయింది. కేసీఆర్ కు, ఆత్మగౌరవం అనే పదానికి లింకు పెట్టి టీడీపీ నాయకులు సెటైర్లు, ఆరోపణలు చేయడం మొదలుపెట్టేశారు. ఎప్పటిలాగే కేసీఆర్ మీద టీడీపీ విమర్శనాస్త్రాలు చేస్తూనే... ఆయనకు, ఆత్మగౌరవానికి లింకుపెట్టి సరికొత్త యాంగిల్ లో తిరుగుబాటు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెరాస ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే.. కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా గద్దె దించాలంటూ ఆ పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ మీద తిరుగుబాటు చేయాలని.. ఆయన్ను సీఎం పదవి నుంచి దించితేనే తమతమ ఆత్మగౌరవాలను కాపాడుకోవచ్చునంటూ ఆ పార్టీ అభ్యర్థిస్తోందని తాజా సమాచారం!

ప్రస్తుతం మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో పార్టీలమధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తెరాస మీద బురద చల్లడానికి ఆత్మగౌరవం అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నారు. కేసీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలుస్తుందని ఆయన కామెంట్లు చేశారు. అలాగే.. కేసీఆర్ బీహార్ నుంచి వచ్చారని.. తెలంగాణాను పాలించే హక్కు ఆయన లేదని ఆయన ఆశ్చర్యకరమైన విమర్శలు చేశారు. నిన్నమొన్నటివరకు కేసీఆర్ కు శ్రీకాకుళం మూలాలున్నాయని మాత్రమే తెలిసుగానీ.. రేవంత్ హఠాత్తుగా బీహార్ మూలాల ప్రస్తావన తీసుకురావడం విశేషంగా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  trs party ministers  tdp party ministers  telangana state  

Other Articles