Kannada movie supporting actress sruthi chandralekha arrested in actor renold peter prince murder case

kannada actress sruthi chandralekha, sruthi chandralekha, shruthi chandralekha, renold peter prince murder case, tamil hero renold peter prince murder, shruthi chandralekha renold peter prince, murder case

kannada movie supporting actress sruthi chandralekha arrested in actor renold peter prince murder case

హత్యకేసులో నటి శృతి అరెస్ట్!

Posted: 09/06/2014 10:42 AM IST
Kannada movie supporting actress sruthi chandralekha arrested in actor renold peter prince murder case

(Image source from: kannada movie supporting actress sruthi chandralekha arrested in actor renold peter prince murder case)

ఇక్కడ శృతి అంటే కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కాదులెండి... బెంగుళూరుకు చెందిన సినిమా సహాయ నటి! తమిళ నటుడు రెనాల్డ్ పీటర్ ప్రిన్స్ హత్యకేసులో ఈ అమ్మడిని బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఈ హత్యకేసు ముడిని విప్పడానికి నానాతంటాలు పడిన పోలీసులు... చివరకు ఫిర్యాదు చేసిన నటి శృతియే ఈ హత్యకు పాల్పడిందని తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ హత్యకేసుకు సంబంధించి ఈ నటి ఆడిన నాటకాన్ని చూసి అందరూ నివ్వెరపోయారు. కేవలం డబ్బులకోసం ఆశపడిన ఈ సహాయనటి... రెనాల్డ్ తో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేకపోయినప్పటికీ అతను తన భర్తంటూ నమ్మించి, అతని ఆస్తి మొత్తం దండేయాలనే పథకంతో పోలీసులను మూడుచెరువుల నీటిని తాగించింది.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లై జిల్లా నాంగునేరి సమీపంలో వుండే పరప్పాడికి చెందిన రెనాల్డ్ పీటర్ ప్రిన్స్ (36) ఒక మెకానికల్ ఇంజినీర్. కంప్యూటర్ విద్యను అభ్యసించిన ఇతను... తెన్‌కాశి, పావూర్, సత్రం, ఆలంగుడం తదితర ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్లు నడుపుతూ వచ్చాడు. ఆ తరువాత వాటిని వేరొకరికి అప్పగించి ఆన్‌లైన్ వ్యాపారంలో నిమగ్నమయ్యేందుకు చెన్నైకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మదురవాయల్‌లో ఉంటూ చలనచిత్రాలకు ఫైనాన్స్ చేస్తూ వచ్చారు. ఇలా చేస్తూనే.. కాగితపురం, కొక్కిరకులం, నెల్లైమావట్టం చిత్రాల్లో నటించారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు వ్యాపారాలు చేసుకుంటూ ఈ యువనటుడు బాగానే డబ్బులు పొగేసుకున్నాడు.

ఇదిలావుండగా... బెంగళూరుకు చెందిన సినిమా సహాయ నటి శ్రతి చంద్రలేఖతో రెనాల్డ్‌కు ఒక సినిమా నేపథ్యంలో పరిచయమేర్పడింది. ఈ పరిచయంలో భాగంగానే ఆమె రెనాల్డ్ దగ్గర బాగానే డబ్బులున్నాయని తెలుసుకుంది. దీంతో అతనితో సన్నిహితంగా వుంటూ అతను చేస్తున్న వ్యాపారాలావాదేవీలు, ఆస్తుల వివరాలను బాగానే సేకరించింది. అయితే అతని ఆస్తిని మొత్తం దండేయాలన్న నెపంతో శృతి.. రెనాల్డ్ వ్యాపారంలో భాగస్వామి అయిన ఉమాచంద్రన్ తో కలిసి అతన్ని హతమార్చేందుకు ఒక పథకం వేసింది. ప్లాన్ ప్రకారం.. గత జనవరి మదురవాయల్ నుంచి రెనాల్డ్‌ను కారులో కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఆ తరువాత పాళయం కోటలో అతని మృతదేహాన్ని పాతిపెట్టి తమకేమీ తెలియనట్లు మిన్నకుండిపోయారు.

కొన్నాళ్ల తర్వాత నటి శ్రుతి మదురవాయల్ పోలీసులకు తన భర్త రెనాల్డ్ కనిపించడం లేదని.. అతని ఆచూకీ కనుగొనాలంటూ నాటకమాడింది. ఇందుకు సంబంధించి ఆమె పోలీసులకు ఒక ఫిర్యాదు పత్రం కూడా అందచేసింది. నిజానికి రెనాల్డ్, నటి శృతి పెళ్లి చేసుకోలేదు. కానీ వారు ఇరువురూ భార్యాభర్తలుగా జీవనం కొనసాగించినట్లు పోలీసులను నమ్మబలికింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తును చేపట్టారు. అయితే నటి శృతి మాత్రం ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని వెళ్లింది. పోలీసులు కూడా ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టలేదు కానీ.. దర్యాప్తును మాత్రం కొనసాగించారు.

ఇలా కొన్నిరోజులు గడిచిన అనంతరం రెనాల్డ్ సోదరుడు జస్టిన్ తిరునెల్వేలి ప్రాంతం నుంచి చెన్నైకి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మధురై సమీపంలోని తిరుమంగళం అనే ప్రాంతంలో రెనాల్డ్ కారు కనిపించింది. దానిని చూసి తన సోదరుడిదే అని గుర్తించిన జస్టిన్.. ఆ కారు దగ్గరకు చేరుకున్నాడు. అందులో నాగర్‌కోవిల్‌కు చెందిన సునీల్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని వద్ద కారు గురించి ప్రశ్నించగా అతడు ఉమాచంద్రన్ అనే వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలకు బేరమాట్లాడి ఒక లక్ష అడ్వాన్సుగా చెల్లించి తీసుకున్నట్లు తెలిపారు. అతను ఈ విషయం చెప్పిన వెంటనే జస్టిన్ కు అనుమానాలు రేకెత్తాయి. ఇది వరకే రెనాల్డ్ కు, ఉమాచంద్రన్‌కు మధ్య వివాదం ఉన్నట్లు తెలుసుకున్న జస్టిన్ దీనిపై అనుమానించి పాళయం కోట్టై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయి దర్యాప్తును చేపట్టారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి శృతి.. గత ఎనిమిది నెలలుగా అజ్ఞాతంలో వున్న ఆమె బెంగళూరుకు పరారైనట్టు తెలిసింది. ఈ కేసు విచారణను కోయంబేడులో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డెప్యూటీ కమిషనర్ మోహన్‌రాజ్ చేపట్టారు. మదురవాయల్ సబ్ ఇన్‌స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలోని పోలీసులు బెంగళూరులో శ్రుతిని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి చెన్నైకు తీసుకువచ్చారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles