Rayaseema started movement for capital

telangana, rayalaseema, coastal, andhra, ap capital, vijayawada, kadapa, kurnool, ap assembly, hyderabad, chittor, anantapuram, latest news, protest, movement

rayalaseema district people wants capital should be in seema only : 2districts of rayalaseema shuts for capital in seema area

రాయలసీమలో రాజధానిపై రణం

Posted: 09/04/2014 11:03 AM IST
Rayaseema started movement for capital

ఏపీలో రాజధాని ఏర్పాటుపై రాజుకుంది. సీమలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ నాలుగు జిల్లాల ప్రజలు ఉద్యమం మొదలు పెట్టారు. సీమలో క్యాపిటల్ కోసం ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విజయవాడను ముందు తాత్కలిక రాజధానిగా ప్రకటించటంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమం.., ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాజధాని కోసం ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు ఒక్కటయ్యాయి. రాయలసీమ రాజధానిసాధన సమితి ఏర్పాటు చేసుకుని.., నిరసనలు చేపడుతున్నారు. సాదన సమితి ఆద్వర్యంలో సీమ బంద్ కొనసాగుతోంది.

కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. దీనికి ప్రజల నుంచి కూడా స్పందన వస్తోంది. యునివర్సిటీల్లో విద్యార్థులు కూడా రాజధాని కోసం ఉద్యమం మొదలు పెట్టారు. కడప, కర్నూలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పట్టణాల్లో విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. అటు ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం రాజధాని త్యాగం చేసిన రాయలసీమకు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని రావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బంద్ ప్రభావం చిత్తూరులో కన్పించటం లేదు.

ఏపీ ఏర్పాటు సమయంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాలని సీమ ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ ఉద్యమానికి స్థానికంగా ఉండే నేతలు మద్దతు తెలుపుతున్నా.., ఏ పార్టీ కూడా అధికారికంగా మద్దతు ప్రకటించలేకపోతుంది. రాజకీయంగా ఉన్న సమీకరణాలు, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలు ప్రకటన చేసేందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital  rayalaseema  protest  latest news  

Other Articles