Telangana minister harish rao controversial comments on chandrababu kishan reddy pawan kalyan

minister harish rao, chandrababu naidu, pawan kalyan, kishan reddy, tdp party, bjp party, janasena party, medak mp elections

telangana minister harish rao controversial comments on chandrababu kishan reddy pawan kalyan

పవన్, బాబు డైరెక్షన్ లో ‘‘రెడ్డి’’ కీలుబొమ్మ!

Posted: 09/04/2014 10:08 AM IST
Telangana minister harish rao controversial comments on chandrababu kishan reddy pawan kalyan

(Image source from: telangana minister harish rao controversial comments on chandrababu kishan reddy pawan kalyan)

ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాన రాజకీయ పరిణామాలు వాడీవేడీగా నడుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరిపోతున్నాయి. అయితే వీరిలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీ నాయకులు మాటలతూటాలతో ఒక్కొక్కొరికి పొడుచుకుంటున్నారు. ఈ యుద్ధం ఎంతవరకు సాగుతోందంటే.. ఏకంగా చెప్పులతో కొట్టుకునే మాటలదాకా వెళ్లిపోయింది. అందులోభాగంగానే తెలంగాన టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ అధినేత - సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను సమైక్యవాది అని మరోసారి చెబితే.. చెప్పులతో కొడతామని టీ.టీడీపీ మంత్రులు హెచ్చరించారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీపై తనవంతు విమర్శలు చేశారు. అందుకు ధీటుగానే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. తమ మీద విమర్శలు చేసిన అందరూ నాయకులమీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కిషన్ రెడ్డి కీలుబొమ్మగా మారాడని ఆయన పేర్కొన్నారు. ఇంతకు తెలంగాన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డా..? లేక చంద్రబాబు నాయుడా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంకా రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ లాంటివారి డైరెక్షన్ లో బీజేపీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి నడుచుకోవడం చాలా హాస్యాస్పదంగా వుందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్నే ఆయన ‘‘పవన్, చంద్రబాబు డైరెక్షన్ లో ‘‘రెడ్డి’’ కీలుబొమ్మ’’ అంటూ ఆయన అభివర్ణించారు.

గతంలో సమైక్యవాదినంటూ చెప్పుకున్న జగ్గారెడ్డికి మద్దతు తెలుపుతున్న టీడీపీ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టీ.తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మీద కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. వారికి ఏమాత్రం రోషం వున్నాగానీ చంద్రబాబుకు పల్లకి మోయడం ఆపాలని అన్నారు. ఇక మెదక్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ.. మెదక్ స్థానం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రణాళికలు రచించినా.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారని ఆయన నమ్మకాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికోసం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని.. అవి త్వరలోనే ఆచరణలోకి రానున్నాయని స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  chandrababu naidu  kishan reddy  pawan kalyan  medak mp elections  

Other Articles