Telangana nri forum australia vinayaka chaviti celebrations

Telangana NRI Forum- Australia, nri, telangana forum, ganesh chaviti, vinayaka chaviti, latest news, melbourne, ravindar goud

Telangana NRI Forum- Australia celebrated vinayaka chaviti with a glory of happyness : in melbourne Telangana NRI Forum- Australia held vinayaka chaviti as first event by it sÁsÁsÁ

మెల్ బోర్న్ లో తెలంగాణ గణేషుడి వేడుకలు

Posted: 09/03/2014 04:57 PM IST
Telangana nri forum australia vinayaka chaviti celebrations

దేశం దాటినా వారు సాంప్రదాయాలు, ఆచారాలను మాత్రం వదిలిపెట్టలేదు. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా తల్లి భారతిని అంటూ ఆస్ర్టేలియా గడ్డపై కూడా ఘనంగా భారతీయ పండగలు చేసుకుంటున్నారు. తెలుగుదనాన్ని ప్రపంచవ్యాపితం చేస్తున్నారు. మెల్ బోర్న్ లో తెలంగాణ ఎన్.ఆర్.ఐ ఫోరం - ఆస్ర్టేలియా ఆద్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉండే తెలుగువారే కాదు.., ఇతర రాష్ర్టాల వారు చివరకు ఆస్ర్టేలియా ప్రజలు కూడా ఈ తెలంగాణ ఎన్.ఆర్.ఐ భక్తిభావం ముందు మోకరిల్లారు. వినాయకుడిని మనసారా వేడుకున్నారు.

తొలి వేడుకే విఘ్నేషుడి చతుర్ధి

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు నేపథ్యంలో ఆస్ర్టేలియాలో కూడా కొత్తగా తెలంగాణ ఎన్.ఆర్.ఐ ఫోరం ఏర్పడింది. ఈ సంఘం తొలి అధ్యక్షుడుగా రవిందర్ గౌడ్ ఎన్నికయి అసోసియేషన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. రెండేళ్ళ పాటు రవిందర్ గౌడ్ నేతృత్వంలోని కార్యవర్గం పనిచేస్తుంది. ఆగస్టులో ఏర్పడిన ఈ అసోసియేషన్ నిర్వహించిన తొలి కార్యక్రమమే వినాయక చవితి. తొలి నీకు పూజ విఘ్నరాజా అన్నట్లుగా గణేషుడి చతుర్దిని తొలి కార్యక్రమంగా నిర్వహించారు. మొదటి కార్యక్రమం అయినా వినాయకుడి అండ ఉండటంతో పండగ సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయి.

telangana-australia-01
telangana-australia-02
telangana-australia-03
telangana-australia-04
telangana-australia-05
telangana-australia-06
telangana-australia-07
telangana-australia-08
telangana-australia-09
telangana-australia-10
telangana-australia-11
telangana-australia-12
telangana-australia-13

నాలుగు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించారు. మంగళవారం రాత్రి జరిగిన నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. తెలంగాణ ఎన్.ఆర్.ఐ అసోసియేషన్ సభ్యులు, యువతతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారు దాదాపు ఐదు వందల మంది ఈ వేడుకల్లోపాల్గొన్నారు. పాటలు పాడుతూ.., సాంప్రదాయ నృత్యాలు చేస్తూ కోలాహలంగా సాగిన ఉత్సవం గణేషుడిని నిమజ్జనంతో ముగిసింది. స్థానిక ఎంపీ, నగర కౌన్సిలర్ సహా ఇతర ప్రముఖులు స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగువారికి తామెప్పుడూ అండగా ఉంటామని నగర ప్రముఖులు మరోసారి చాటి చెప్పారు.

విదేశాల్లో ఉన్నా తెలుగుదనం, సాంప్రదాయాలను చాటేలా పండగను నిర్వహించిన తెలంగాణ ఎన్.ఆర్.ఐ. ఫోరం -ఆస్ర్టేలియా ను అందరూ అభినందిస్తున్నారు. రవీందర్ గౌడ్ లాంటి వ్యక్తుల పట్టుదల వల్ల ఆస్ర్టేలియాలో తెలుగువారి పట్ల గౌరవం పెరుగుతుందని అంటున్నారు. అటు భవిష్యత్ లో ప్రతి పండగను ఇలాగే సాంప్రదాయబద్దంగా, ఆచారాలతో జరుపుకుంటామని.., ఆస్ర్టేలియాలో తెలుగు సుమాలు పూయిస్తామని తెలంగాణ ఎన్.ఆర్.ఐ. అసోసియేషన్ చెప్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana NRI Forum  Australia  melbourne  latest news  

Other Articles