Shah rukh khan threatened by gangster ravi pujari

shah rukh khan latest news, shah rukh khan news, shah rukh khan ravi pujari, shah rukh khan threatened calls ravi puraji, shah rukh khan police security, shah rukh khan threatened calls, shah rukh khan underworld don, shah rukh khan new movie, shah rukh khan happy new year movie

Shah Rukh khan threatened by gangster Ravi Pujari : the bollywood baadshah shah rukh khan gets threatenend calls from underworld gangster ravi pujari so that the police security increased for him

షారుఖ్ ఖాన్ పై గురిపెట్టిన ముంబై మాఫియా!

Posted: 08/26/2014 04:12 PM IST
Shah rukh khan threatened by gangster ravi pujari

బాలీవుడ్ కింగ్ ఖాన్ బాద్షా షారుఖ్ ఖాన్ పై ముంబై మాఫియా గురి పెట్టిందా..? ప్రస్తుతం ఈ అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలతోపాటు ముంబై పోలీసులకు కూడా వచ్చాయి. ఈ అగ్రహీరోపై రవి పూజారి గ్యాంగ్ గురి పెట్టిందని.. అతను షారుఖ్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ బాద్షాకు భద్రత మరింత పరిష్టం చేయాలనే నిర్ణయంతో మరింత పోలీసు సిబ్బందిని పెంచినున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ క్రిమినల్ పేరు సంపాదించుకున్న రవిపూజారి సోమవారం మధ్యాహ్నం షారుఖ్ తో మాట్లాడటానికి ప్రయత్నించినట్లు సమాచారం! దాంతో అతను షారుఖ్ పై అటాక్ చేసే ప్రమాదం వుందనే ముందు జాగ్రత్తతో అతనికి భద్రతను పెంచారు.

ఇటీవలే బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీ ఇంటివద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఐదురౌండ్ల కాల్పులు జరిపిన విషయం విదితమే! కొన్నిరోజుల క్రితమే తనకు భారీమొత్తంలో డబ్బులు పంపించాల్సిందిగా అలీ మొరానీకి రవి పూజారి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినా.. ఆయన మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆయనను భయపెట్టేందుకు ఈ విధంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. షారుఖ్ ఖాన్ కు అలీ మొరానీ చాలా సన్నిహితుడు.. వ్యాపార భాగస్వాముడు కూడా! దీంతో అలీ మొరానీ తనకు మొండిచెయ్యి చూపిన నేపథ్యంలో ఇప్పుడు అతని కన్ను షారుఖ్ పై కన్ను పడిందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. ముందుజాగ్రత్తగా షారుఖ్ కు భారీగా పోలీసు భద్రతను పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  happy new year movie  ravi puraji  bollywood baadshah  mumbai mafia  

Other Articles