Ap government released notifications for 10 thousand teacher posts in ap on september 5

ganta srinivasa rao, ganta srinivasa rao press meeting, unemployees in ap, ap unemployees, 10 thousand teacher posts, 10 thousand government teacher posts in ap, chandrababu naidu, ap government

ap government released notifications for 10 thousand teacher posts in ap on september 5

10వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల!

Posted: 08/26/2014 03:48 PM IST
Ap government released notifications for 10 thousand teacher posts in ap on september 5

ఆంధ్రప్రదేశ్ లో వున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక తియ్యని వార్తను విడుదల చేసింది. ఈసారి ఏకంగా 10వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్టు బహిరంగ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లోని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. 10 టీచర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాల విషయంపై ఏపీలో వున్న అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం త్వరలోనే నిర్వహించనున్నామని తెలిపారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని పేర్కొన్న ఆయన... ఈ తరహాలోనే మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే ఏపీలో వున్న నిరుద్యోగులకు ఉద్యోగం లభించేలా అన్నీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కేవలం ప్రభుత్వం ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థల్లోనూ నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేలా చూస్తామని ఆయన అన్నారు.

ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు, వైఎస్ జగన్ మోహన్ మీద ఘాటుగా విమర్శలు చేశారు. జగన్ అసెంబ్లీని ఇడుపులపాయ, పులివెందుల అనుకోని ప్రసంగించడం ఎంతో అవివేకమని ఆయన విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో హత్యాకాండలు రాజ్యమేలాయని.. ఇప్పుడు వాటిని ఎంత తోసిపుచ్చినా అవి అంత సామాన్యంగా తుడిచిపోవని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap government jobs  teacher posts  ganta srinivasa rao  chandrababu naidu  telugu news  

Other Articles