She married her brother and did not know it for 7 years

Brazil couple brother and sister, Brazil woman, Brazilian Adriana, Adriana husband Leandro

She married her brother and did not know it for 7 years: e Brazilian couple's life seemed complete: Husband and wife for seven ... despite the shocking truth that they are actually brother and sister.

అక్కతో తమ్ముడి పెళ్లి కాపురం! 7ఏళ్ల కు తెలిసిన నిజం

Posted: 08/08/2014 01:35 PM IST
She married her brother and did not know it for 7 years

చిన్నతనంలో విడిపోయిన వారు.. వేరు ప్రాంతాల్లో ఉంటూ. పెళ్లి చేసుకున్నారు. హాయిగా వారి కాపురం .. పుట్టిన పాపతో సాగిపోతుంది.. ఇంతలో ఒక పిడుగులాంటి వార్తకు తెలిసింది. దీంతో ఏడేళ్లు నేను కాపురం చేసింది సొంత తమ్ముడితోనా? నేను ఏడేళ్లు కాపురం చేసి పాపను కన్నది సొంత అక్కతోనా? అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. విధి ఆడిన వింత ఆటలో.. ఈ ఇద్దరు బలై.. బంధువులుగా మిగిలిపోయారు. ఈ విచిత్ర సంఘటన బ్రెజిల్లోని ఆడ్రియానా అనే మహిళకు, ఆమె భర్త లియాండ్రో కు ఎదురైంది.

ఈ అక్కాతమ్ముడు వేర్వేరుగా ఎక్కడెక్కడో పెరిగారు. యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత కాకతాళీయంగా పెళ్ళిచేసుకున్నారు. తమ ఇద్దరు తల్లుల పేర్లు మారియా కావడం కాకతాళీయం అని భావించేవారట. కానీ, అప్పటికి తెలియదు ఆ జోడీకి, తమ ఇద్దరి తల్లి ఒక్కతేనని.

అయితే, సావోపాలోలోని గ్లోబ్ రేడియాకు ఓ ప్రత్యేకత ఉంది. జాడ తెలియకుండా పోయిన బంధువులను వెతికిపట్టుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందీ రేడియో స్టేషన్. ఈ కార్యక్రమం ద్వానా ఆడ్రియానా తన తల్లి మారియాను కలుసుకోగలిగింది.

ఆ సందర్భంగా మారియా చెప్పింది, తనకో కుమారుడు ఉండేవాడని, అతని పేరు లియాండ్రో అని. ఇంకేముందీ, వివరాలన్నీ పరిశీలిస్తే... ఆడ్రియానా భర్తేనని తెలిసింది. కానీ, ఇప్పుడు తామిద్దరం ఒక్కటయ్యామని, ఇది భగవంతుడి లీల అని ఆడ్రియానా, లియాండ్రో అంటున్నారు. భార్యాభర్తలుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు వారిద్దరూ.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles