Ebola virus creating new sensation whole world

Ebola virus, ebola virus victims, ebola virus patients, ebola virus sensation, ebola virus latest news, medical treatement for ebola virus patients

Ebola virus creating new sensation whole world : The ebola virus goes viral in the world and creating new sensation. This virus transfer from man to man and killed as soos as possible

ప్రపంచ అగ్రదేశాలను దడ పుట్టిస్తున్న ప్రాణాంతక ‘‘ఎబోలా’’!

Posted: 08/05/2014 06:48 PM IST
Ebola virus creating new sensation whole world

ఖాయం! మొన్నా మధ్య సార్స్.. తర్వాత హెన్1ఎన్1 వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రజలను పరుగులు తీయిస్తే... ఇప్పుడు తాజాగా ఈ ‘‘ఎబోలా’’ ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం సియోర్రాలియోన్, లైబీరియా వంటి ప్రాంతాల్లో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపించిపోయింది. ఇప్పటికే దాదాపు 887 మంది ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఇక పశ్చిమాఫ్రికా దేశాల్లో వుండే వైద్యవర్గాలు అయితే ఈ ఎబోలా వైరస్ బారిన పడిన వారిని చికిత్స చేయడానికి చేతులెత్తేశారు.

ప్రస్తుతం ఈ వైరస్ వ్యాపించిన సియోర్రా లియోన్, లైబీరియా, గినియా దేశాల్లో అదుపు చేసేందుకు దాదాపు 1218 కోట్ల రూపాయల సాయాన్ని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఎంతవీలైతే అంత త్వరగా దీనిని నిర్మూలించేందుకు అన్నిరకాల ఏర్పాటు చేయాలని... లేకపోతే పరిస్థితులు రానురాను మరీ దారుణంగా మారిపోతాయని ప్రపంచఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గత వారమే ప్రకటించింది కూడా! గడిచిన ఈ రెండువారాల్లోనే 61 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 887 మంది ఈ వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచం మొత్తం మీద వ్యాపించి తన ప్రతాపాన్ని చూపించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా ఈ వైరస్ గినియాలోని అటవీప్రాంతాల్లో వెలుగుచూసింది. అక్కడి నుంచి మొదలైన దీని వేటతో ఇప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతూనే వుంది. అక్కడి నుంచి పొరుగునే వున్న లైబీరియా, సియెర్రా లియోన్ ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. నైజీరియాలోని పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు... లైబీరియా పర్యటనలో ఈ వైరస్ బారిన పడ్డాడు. అయితే అది సోకినట్టు అతనికి తెలియలేదు. లైబీరియా నుంచి వచ్చిన తరువాత జూలై నెలలో మరణించాడు. అతనికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ సంఘటనతో భయపడిపోయిన వైద్యబృందాలు.. ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయడానికి వెనకడుగు వేశారు. మరికొన్నిదేశాల్లో అయితే ఈ వైరస్ కు భయపడి అసలు పాఠశాలలను తెరవడం కూడా మానేశారు.

ఇక సాధారణ వైద్యులు దీనికి వైద్యం చేసేది లేదని తేల్చి చెప్పడంతో.. ఎక్కువ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియోర్రా లియోన్, ఇంకా తదితర ప్రాంతాలకు పంపించారు. ఆ ప్రాంతాలలోనే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా నమోదైంది. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ వైరస్ సోకకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను క్వారంటైన్ చేసినట్టు ప్రకటించి... అక్కడి నుంచి ఎవరినీ ఇతర ప్రాంతాలకు అనుమతించకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలో వుండే ఒక చిన్న ఔషధ సంస్థ ఈ వైరస్ కు ఒక సీరమ్ ను తయారుచేసింది. ప్రస్తుతం ఇంకా ప్రయోగదశలోనే వున్న దీనిని ఇద్దరు వ్యక్తులపై చాలా రహస్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇది కొంతవరకు బాగానే పనిచేస్తోందని వారు వెల్లడిస్తున్నారు. ఇది మాత్రం నిజమే అయితే.. ఈ సమస్యను త్వరలోనే అరికట్టవచ్చునని సదరు సంస్థ పేర్కొంటోంది. అయితే దీని ఖరీదు చాలా ఎక్కువ వుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న ఆ కంపెనీ.. పేద ప్రజలకు చేరడం చాలా కష్టమేనని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ebola Virus  Ebola virus patients  ebola virus medical treatement  

Other Articles