Irrigation minister harish rao clarification farmers about power cuts

harish rao latest news, harish rao, irrigation marketing minister harish rao, harish rao comments power problems, harish rao comments water problems, harish rao kcr news, harish rao telangana farmers, telangana farmers protest

irrigation minister harish rao clarification farmers about power cuts : telangana state irrigation and marketing minister harish rao gave promises to t farmers about power cuts and also explains about water supply.

ఇకనుంచి తెలంగాణాలో ‘‘వెలుగుల పంట’’!!

Posted: 08/05/2014 04:23 PM IST
Irrigation minister harish rao clarification farmers about power cuts

(Image source from: irrigation minister harish rao clarification farmers about power cuts)

గతకొన్ని రోజుల నుంచి తెలంగాణాలో తీవ్ర విద్యుత్ కొరత వున్న విషయం విదితమే! దీంతో పట్టణాల్లో వున్న ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వుంటున్న రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కనీసం ఒక గంటసేపు వరకు కూడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పంటలు సాగు చేసుకోవడానికి చాలా కష్టం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు. ఈ ఘటన జరిగిన తరువాతి రోజే కేసీఆర్ ఈ విషయంపై స్పందించి, రైతులకు విద్యుత్ కొరత లేకుండా చేస్తామని... ఆంధ్ర ప్రభుత్వంతో రావాల్సిన 710 మెగావాట్ల కోసం పోరాడుతామని హామీ కూడా ఇచ్చేశారు.

ఇదిలావుండగా.. ఈ విద్యుత్ కొరత అంశంపైనే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు కూడా తాజాగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న రైతులకు పూర్తి స్థాయిలో విద్యుత్తును అందిస్తామని ఆయన హామీ ప్రకటించారు. అందుకు అవసరమైతే పరిశ్రమలకు అందుతున్న విద్యుత్ ను రెండురోజులపాటు కోతలు విధించి, రైతులకు సప్లై చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం మహబూబ్ నగర్ లో 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles