Sachin enquiry in ap capital for vijayawada leaders

Sachin PVP Square Mall, Sachin Tendulkar PVP, sachin anushka, pvp and sachin, sachin tendulkar in vijawada, sachin ap lands, sachin ap capital, sachin politics, sachin 100 acres in ap, sachin bouth 100 acres, ap capital news, andhrapradesh capital controversy, sachin latest press meet, sachin latest speech, sachin and pvp, sachin and chandrababu naidu,

sachin enquiry in ap capital for vijayawada leaders: Legendary cricketer Sachin Tendulkar and Prasad V. Potluri, CMD, PVP Ventures,at the launch of the PVP Square mall in Vijayawada...

ఏపీ రాజధానికి కోసం సచిన్ ఎదురుచూపులు!

Posted: 08/02/2014 11:39 AM IST
Sachin enquiry in ap capital for vijayawada leaders

సచిన్ ఇప్పుడు ఏపీలో హాట్ టాఫిక్ మారిపోయాడు. గత కొద్ది రోజులగా.. సచిన్ కు ఏపీలో భూములు ఉన్నాయని మీడియాలో, న్యూస్ పత్రికల్లో వార్తలు హల్ చల్ చేశాయి. అలాంటి వార్తలకు సచిన్ నిన్న బెజవాడలో ప్రాణం పోశాడు. అవి పుకార్లు కాదు.. నిజమే అనే విధంగా.. సచిన్ నిరూపించాడు.

బాబు ! ఇంతకీ ఆంద్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెడతున్నారు.? నాకు కొంచెం వివరంగా చెబుతాడా? అని అక్కడే ఉన్న కొంతమంది బెజవాడ నేతలను, రాజకీయల్లోకి రావాలని గట్టిగా ప్రయత్నంచి , సైలెంట్ గా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసుకుంటున్న పీవీపీ ని కూడా ఏపీ రాజధానిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రం విడిపోయిన తరువాత సచిన్ మొట్టమొదటి సారిగా .. విజయవాడలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలోనే..కొత్త రాజధాని గురించి ఆరా తీయటం, అందరికి ఆశ్చర్యం వేసింది. నిన్నటి వరకు బ్యాట్ తో పంతులను పరుగులు పెట్టించే సచిన్.., ఈరోజు రాజకీయల్లోకి దిగి, బిజినెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జోరందుకోవటంతో అతడు ఇక్కడ భూములు కొన్నాడని ప్రచారం జరిగింది. అయితే సచిన్ స్నేహితులు మాత్రం ఈ వార్తను కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్ లో సచిన్ ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. అయితే దీనిపై సచిన్ మాత్రం పెదవి విప్పలేదు. కాగా గతంలో నెల్లూరు జిల్లాలో సచిన్ భూములు కొన్న విషయం తెలిసిందే.

ఏమైన ఈ పరుగుల బుల్లెట్..ఏపీ రాజధాని పై ఆరా తీయటం కొత్త విషయమే. కానీ కొంతమంది ఈవిషయం మింగుడుపడటంలేదు. సచిన్ లాంటి వారు పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపిస్తే.. ఎపీలోని యువతక మంచి అవకాశాలు దొరుకుతాయని అయన అభిమానులు అంటున్నారు.

ఒకరకంగా చెప్పలంటే.. సచిన్ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాజధానికి కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు? ఏపీ రాజధాని ఎక్కడ ఏర్పాటు జరుగుతుందోనని సచిన్ లో ఒకటే టెన్షన్ మొదలైంది. అందుకే..ఇప్పుటి నుంచి రాజధాని గురించి ఆరా తీస్తున్నారు. ఏపీ మీద సచిన్ కు ఎంత ప్రేమో అని ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles