Parliament house staff palm civet endangered species

Palm civet Parliament house, Wildlife SOS, Endangered species palm civet, harmless palm civet, grave digger civet

Parliament house staff palm civet endangered species: Palm civet straying in Parliament house rescued

వింత జీవిని చూసి వణికిన పార్లమెంట్ సిబ్బంది

Posted: 07/29/2014 01:20 PM IST
Parliament house staff palm civet endangered species

పార్లమెంట్ ప్రాంగణంలో కనిపించిన వింత జీవిని చూసి పార్లమెంట్ సిబ్బంది భయంతో వణికిపోయింది.  వెంటనే వైల్డ్ లైఫ్ ఎస్ వో ఎస్ కి ఫోన్ చెయ్యగా అక్కడి నుంచి సిబ్బంది వచ్చి ఆ జీవిని పట్టుకున్నారు.  

ఎప్పుడూ చూడకపోయేసరికి చూడటానికి భయం గొల్పినా అది ఎవరికీ హాని కలిగించని పామ్ సైవెట్.  ఆ జాతే అంతరించే ప్రమాదంలో ఉన్న జాతి.  చెట్ల మీదకు ఎక్కి, పండ్లు, ఒక్కోసారి మురిగిన ఆహారం కూడా తీసుకునే జీవి.  దీన్ని కబర్ బిచ్చు అని గ్రేవ్ డిగ్గర్ అని పిలుస్తారు.  అంటే సమాధులనుతవ్వే జంతువు.  ఇది క్షీరజం.  

పార్లమెంట్ హౌస్ లో టివి వెనక భయంతో నక్కి ఉన్న ఈ జంతువు పార్లమెంట్ హౌస్ సిబ్బందిని బాగానే భయపెట్టింది.  చెట్ల పైకి అవలీలగా ఎక్కే పామ్ సైవెట్ ఎసి డక్ట్ లలో, అటుకుల మీద ఎక్కి దాక్కుంటుంది.  

వైల్డ్ లైఫ్ ఎస్ వో ఎస్ సహ సంస్థాపకురాలు గీత శేషమణి మాట్లాడుతూ ఇలాంటి మూగజీవులకు ఆశ్రయమిస్తున్న ఢిల్లీ ధన్యమైనదని, ఇలాగే నగరంలో పచ్చదనం ఉంటే ఇలాంటి మూగజీవులెన్నో ఇంకా జీవించగలుగుతాయని అన్నారు.  

ప్రస్తుతం డిహైడ్రేషన్ లో ఉన్న పామ్ సైవెట్ ని వైద్య పరిశీలనలో ఉంచారు.  వన్య జీవరాశుల సంరక్షణ గురించి అందరికీ తెలియవలసిన అవసరం ఉందని కూడా ఆ సంస్థ అభిప్రాయపడింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles