Delhi gang rape at gunpoint

Delhi gang rape, Women safety, Sexual assaults, rape at gunpoint

Delhi Gang rape at gunpoint: Five persons including two minors gang rape school going girl

గన్ తో బెదిరించి గాంగ్ రేప్- రాజధానిలో

Posted: 07/29/2014 12:42 PM IST
Delhi gang rape at gunpoint

ఢిల్లీలో రేప్ అంటేనే దేశమంతా ఉలిక్కిపడేలా అయింది.  పశ్చిమ ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో పదవ తరగతి చదువుతున్న బాలికను పిస్తోల్ తో బెదిరించి ఐదుగురు అత్యాచారం చేసిన ఘటన 10 రోజులు ఆలస్యంగా వెలుగుచూసింది.  

జూలై 19న జరిగిన ఆ ఘటనను బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినదాని ప్రకారం, ఆ అమ్మాయి ఆ రోజు స్కూల్ కి వెళ్తుండగా ఇద్దరు మైనర్లతోసహా మొత్తం ఐదుగురు ఆమెను బలవంతంగా ఝరోడా ప్రాంతంలో సురేందర్ పహల్వాన్ అనే వ్యక్తి ఇంటికి తీసుకునిపోయారు.  ఆమెను తుపాకీతో బెదిరించి ఆమె మీద అత్యాచారం చేసారు.  అంతేకాదు, జరిగిందంతా వీడియో తీసి ఈ విషయం బయటకు చెప్తే ఇంటర్నెట్ లో వీడియోని అప్ లోడ్ చేస్తామని కూడా వాళ్ళు బెదిరించారట.  మైనర్లు ఇద్దర్ని తను గుర్తుపట్టానని, వాళ్ళు తెలిసినవాళ్ళేనని కూడా బాధితురాలు తెలియజేసింది.  

ఐదుగురిలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.  ఇన్ని రోజులు భయంతో ఎవరికీ చెప్పని ఆ అమ్మాయి ఆ ఘటనతో తనలో కలుగుతున్న అసౌకర్యం దృష్ట్యా సోమవారం తల్లిదండ్రులకా విషయాన్ని తెలియజేయటంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అత్యాచారం జరిగిన ఇంట్లో నివాసముండే సురేందర్ పహిల్వాన్ బాధితురాలిని భయపెట్టటానికి తనో పోలీసు అధికారిగా ప్రకటించుకున్నాడని కూడా పోలీసులు తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles