Attorney general denies lop to congress

Loksabha Leader of Apposition Party, Attorney General of India, Congress loses LOP Loksabha, Loksabha speaker Sumitra Mahajan

Attorney General denies Leader of Opposition Party (LOP) to Congress

ప్రధాన ప్రతిపక్ష హోదా హుళక్కి?

Posted: 07/26/2014 10:05 AM IST
Attorney general denies lop to congress

అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత లేదని శుక్రవారం తెల్చి చెప్పేసారు.  లోక్ సభలోని మొత్తం స్థానాలలో 10 శాతం అంటే 55 స్థానాలు దక్కనందు వలన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పదవి లభించదని రోహత్గీ అన్నారు.
ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయిన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దీని మీద న్యాయ సలహా తీసుకోవటానికి అటర్నీ జనరల్ కి రిఫర్ చేసారు.  
2014 ఎన్నికలలో కేవలం 44 లోక్ సభ స్థానాలలోనే గెలుపొందిన కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్షంగా లోక్ సభలో విశేష హక్కులు పొందే అవకాశం లేదని, మొట్ట మొదటి లోక్ సభ స్పీకర్ మవ్లంకర్ సమయం నుంచి ఇప్పటి వరకు కనిష్టంగా 10 శాతం స్థానాలు పొందని పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదానిచ్చిన సందర్భాలు లేవని రోహత్గీ అన్నారు.  రాజీవ్ గాంధీ సమయంలో 400 పైగా స్థానాలు దక్కించుకున్న యుపిఏ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇవ్వటానికి తిరస్కరించిందని ఆయన గుర్తుచేసారు.  
అయినా పట్టువిడవకుండా, స్పీకర్ అటర్నీ జనరల్ మాటలను లెక్కచెయ్యగూడదని, ఆయన ప్రభుత్వం తరఫు మనిషని, అధికారపక్షఅభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన తన అభిప్రాయంగా చెప్పే అవకాశం ఉంది కాబట్టి స్పీకర్ తనంతట తానుగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ షకీల్ అహ్మద్ కోరారు.  అయితే అటర్నీ జనరల్ రాజ్యాంగ పరంగా న్యాయ నిపుణులుగా ఉన్నత స్థాయిలో ఉన్నవారని, అందువలన ఆయన మాటలను త్రోసిపుచ్చి నిర్ణయం తీసుకోవటం లోక్ సభ స్పీకర్ కి కుదరదని భాజపా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడి అన్నారు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles