Sania mirza telangana brand ambassador nationality issue

Sania Mirza Telangana brand ambassador, Sania Mirza nationality issue, BJP agrees Congress opinion, Sania Mirza Pakistan daughter in law

Sania Mirza Telangana brand ambassador nationality issue, BJP Congress common opinion

సానియా ఇండియనే కానీ తెలంగాణా ఇండియాలో లేదు?

Posted: 07/26/2014 08:45 AM IST
Sania mirza telangana brand ambassador nationality issue

సానియా మిర్జా మీద వచ్చిన జాతీయత వివాదంలో భాజపా కాంగ్రెస్ పార్టీలది ఒకటే మాటైంది.  కాకపోతే రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకుల మధ్య సామరస్యం లేదు.  సానియా మిర్జా ఇండియనే అని అంగీకరించినా, కవిత మాటల్లో తెలంగణా ఇండియాలో లేదుగా!

bjp-lakshmanటెన్నిస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన సానియా మిర్జాను ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటిస్తూ కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసిన సందర్భంగా తెలంగాణా భాజపా శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ ఆమెకెందుకా హోదా అంటూ విమర్శించారు.   ఫీజ్ రియంబర్స్ మెంట్ విషయంలో విద్యార్థుల స్థానికతకు ఆంక్షలు పెట్టిన కెసిఆర్ అసలు దేశంలోనే లేకుండా పెళ్ళిచేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళిపోయిన సానియా మిర్జాని బ్రాండ్ అంబాసడర్ గా నియమించటమేమిటని ఆయన ప్రశ్నించారు.  1956 కి ముందు తెలంగాణాలో పుట్టినవాళ్ళని స్థానికులుగా పరిగణించే కెసిఆర్ మహారాష్ట్రలో పుట్టినామెను ఏకంగా బ్రాండ్ అంబాసడర్ గానే చెయ్యటమేమిటన్నారాయన.

దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా వంతపాడారు.  తెలంగాణా కాంగ్రెస్ నాయకులు కూడా డాక్టర్ లక్ష్మణ్ మాటలతో ఏకీభవించారు.  కానీ కేంద్రంలో నాయకులు అందుకు వ్యతిరేక భావాలను వ్యక్తపరచారు.  అక్కడా కాంగ్రెస్ భాజపాలది ఒకటే మాటైంది.  రెండు జాతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది కానీ రాష్ట్రం, కేంద్రం మధ్య పూర్తిగా విరుద్ధ భావనలు పొడసూపాయి.

సానియా మిర్జా తన జాతీయత మీద వచ్చిన వివాదం మీద కంటనీరు పెట్టుకుని తన హృదయం నిండా ఉన్న దేశభక్తిని చాటుకున్నారు.  డెలివరీ సమయంలో కేసు క్లిష్టంగా కనిపించటంతో ముంబై హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యగా తను అక్కడ జన్మించటం జరిగిందని, తాతల నాటి నుంచి తను హైద్రాబాద్ వాసి అని, పాకిస్తాన్ క్రికెటర్ ని పెళ్ళి చేసుకున్నా తన హృదయం మాత్రం భారతావనికే అంకితమైందని సానియా మిర్జా ప్రకటించారు.   విద్వేష పూరితమైన నాయకుల హృదయాలకు శాంతిని ప్రసాదించమని, వారిని రక్షించమని అల్లాని కోరుకుంటున్నట్లుగా కూడా ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసారు.

kavitaసానియా మిర్జా కన్నీరు కేంద్ర నాయకులను కరిగించింది.  అంతవరకు బాగానే వుంది.  నేను భారతదేశానికి చెందిన వాడను, చెందిన దానను అని హృదయపూర్వకంగా ప్రకటన చేస్తే అంగీకరించవలసిన విషయమే కానీ, ఆమెను బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన కవిత తను హృదయపూర్వకంగా భారతదేశానికి చెందినదానను కానని, తెలంగాణాను బలవంతంగా భారతదేశంలో కలిపేసారు అని స్పష్టంగా చెప్పారు.  మరి దానికేమందాం? 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles