26 children killed nanded passenger train

26 children killed Nanded Passenger, Medak accident, Medak train accident, 26 children killed on Nanded Passenger Train in Medak, Kakatiya Techno School bus, Masaipeta, Veldurthi mandal of Medak district, Masaipeta nanded train bus accident, School bus collides with train in Telangana.

Nanded Passenger Train dashed Private School Bus 26 Students Died ... School Bus (Kakatiya Techno School) near Masaipeta, Veldurthi mandal of Medak district, Students killed as train rams into bus in Medak

26 మంది స్కూల్ పిల్లలను చంపిన నాందేడ్ ప్యాసింజర్!

Posted: 07/24/2014 11:12 AM IST
26 children killed nanded passenger train

మొన్న బియాస్ నది.. 25 మంది తెలంగాణ రాష్ట్ర భావిపౌరులను.. క్షణాల్లో పొట్టనపెట్టుకుంది. ఆ సంఘటన నుండి ఇంక తేరుకోకముందే.. మరో ఘటనతో.. 26 మంది తెలంగాణ ఆణిముత్యాలను .. నాందేడ్ ప్యాసింజర్ రైలు పొట్టనపెట్టుకుంది. ఏ దేవుడికి కన్ను కుట్టిందో తెలియదు గానీ.. తెలంగాణ తల్లలకు గుండెకోత మిగుల్చుతున్నాడు. ఈరోజు ఉదయం మెదక్ జిల్లాలో వెల్ధుర్థి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ ప్రైవేటు స్కూల్ బస్సు లో తెలంగాణ విద్యార్థులు స్కూల్ కు బయలు దేరారు. ఆనందంగా ఇంటినుండి స్కూలు కు బయలు దేరిన స్కూల్ పిల్లలపాలిట.. మృత్యువు నాందేడ్ ప్యాసిజర్ రూపంలో వచ్చి .. 26 మంది స్కూల్ పిల్లలను బలితీసుకుంది.

26-children-killed-on-nanded-passenger-train

రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలోనే 26 మంది విద్యార్థులు మృతిచెందారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఘోర ప్రమాదంలో రైలు స్కూలు బస్సును దాదాపు కిలోమీటరు దూరం ఈడ్చుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండి చూపరులను కలచివేశాయి. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

26-children-killed-on-train

అయితే మాసాయిపేట నాందేడ్ ప్యాసింజర్ , స్కూల్ ప్రమాదం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విచారణకు ఆదేశించారు. అంతేగాకుండా, తక్షణమే సంఘటన స్థలికి వెళ్ళి సహాయకచర్యలను పర్యవేక్షించాలని మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలను ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆయన సూచించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles