Commonwealth games declared open by queen elizabeth ii

commonwealth games declared open by Queen Elizabeth II, commonwealth games 2014,scotland commonwealth games 2014, queen elizabeth ii opens commonwealth games, indian flavor to commonwealth games, spectacular show of commonwealth games

Commonwealth Games declared open by Queen Elizabeth II

కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభించిన రాణి ఎలిజబెత్ II

Posted: 07/24/2014 10:58 AM IST
Commonwealth games declared open by queen elizabeth ii

బుధవారం ప్రారంభమైన కామన్ వెల్త్ క్రీడోత్సవాలు ఆనవాయితీ ప్రకారం కామన్ వెల్త్ దేశాలకు నాయకురాలైన ఎలిజబెత్ II ప్రారంభించారు.  స్కాట్ ల్యాండ్ లోని గ్లాస్గో నగరంలో 35000 మంది వీక్షించటానికి అనువుగా ఉన్న సెల్టిక్ స్టేడియంలో క్రీడలు ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా కామన్ వెల్త్ క్రీడోత్సవాలు

మూడు గంటలపాటు లైట్ అండ్ సౌండ్ వివిధ వర్ణాల ప్రెజెంటేషన్ తో ప్రేక్షకులను సమ్మోహితులను చేసారు.  దానితో, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్లాస్గో నగరం ఒక్కసారిగా నవ్యశోభలతో కోలాహలంగా తయారైంది.
 

Commonwealth-Games-open-by-Queen Elizabeth-1
Commonwealth-Games-open-by-Queen Elizabeth-2
Commonwealth-Games-open-by-Queen Elizabeth-3
Commonwealth-Games-open-by-Queen Elizabeth-4

బ్రిటిష్ కి చెందిన ఆల్ టైమ్ సైక్లిస్ట్ ఛాంపియన్ సర్ క్రిస్ హోయ్ కి ఎలిజబెత్ రాణికి బ్యాటన్ (బెత్తం) బహూకరించే అవకాశాన్ని కల్పించారు.  ఆ తర్వాత కామన్ వెల్త్ క్రీడల సందేశాన్నిచ్చిన రాణి 11 రోజుల కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభమైనట్లుగా ప్రకటించారు.  71 దేశాలకు చెందిన 4929 ఆథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు.  
కామన్ వెల్త్ క్రీడోత్సవాలలో భారత్ ప్రత్యేకత

విశేషమేమిటంటే, యూనిసెఫ్ కి ప్రపంచ గుడ్ విల్ అంబాసెడర్ భారత క్రికెట్ లెజెండ సచిన్ టెండూల్కర్ శిశువుల సంక్షేమం కోసం విరివిగా చందాలు ఇవ్వమని అర్థించిన వీడియో క్లిప్పింగ్ ని ప్లే చెయ్యటం జరిగింది.  షూటింగ్ లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ విజయ్ కుమార్ పతాకాన్ని పట్టుకుని ముందు నడుస్తూ ఆథ్లెట్స్ తో పరేడ్ చేయించారు.   భారత ఆథ్లెట్స్ ప్రవేశించగానే స్టేడియమంతా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.  

Commonwealth-Games-1
Commonwealth-Games-10
Commonwealth-Games-11
Commonwealth-Games-2
Commonwealth-Games-3
Commonwealth-Games-4
Commonwealth-Games-5
Commonwealth-Games-6
Commonwealth-Games-7
Commonwealth-Games-8
Commonwealth-Games-9

స్కాట్ల్యాండ్ యునైటెడ్ కింగ్ డమ్ లో ఉండాలా లేక విడిపోవాలా అన్నదానిమీద సెప్టెంబర్ 18 న ప్రజాభిప్రాయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కి చెందిన ఆథ్లెట్లు ప్రవేశించగానే కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు.  చివర్లో క్రీడలను నిర్వహిస్తున్న స్కాటిష్ ఆథ్లెట్లు పరేడ్ చెయ్యటానికి వచ్చారు.  అప్పుడు మరింత ఉత్సాహంగా స్టేడియంలోని క్రీడా ప్రేమికులు వాళ్ళకి స్వాగతం పలికారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles