219 bodies from malaysian plane debris taken away by insurgents

219 bodies from Malaysian plane debris taken away by insurgents, Donetsk People’s Republic, Malaysian plane Bodies hijacked, Alexander Borodai prime minister of the self-proclaimed Donetsk People’s Republic.

219 bodies from Malaysian plane debris taken away by insurgents

219 శవాలను ఎత్తుకెళ్ళిన వేర్పాటువాదులు

Posted: 07/21/2014 07:50 PM IST
219 bodies from malaysian plane debris taken away by insurgents

పేల్చివేసిన మలేషియా విమానం ఎమ్ హెచ్ 17 లో మృతి చెందిన వారి 219 శవాలను ఆదివారం రష్యన్ మద్దతుదార్లు, ఉక్రైన్ లో వేర్పాటు వాదులు ఎత్తుకునివెళ్ళారు.  192 శవాలను, మరో  8 చెల్లాచెదరైన శరీర భాగాలను విమానం పడిపోయిన స్థలానికి దగ్గర్లోనే ఉన్న టోరేజ్ స్టేషన్లో ఉన్న రిఫ్రెజరేటెడ్ రైల్లో పెట్టారని ఆర్ఐఏ నోవస్తీ చేసిన ప్రకటన.  

ఆమ్ స్టెరిడమ్ నుండి కౌలాలంపూర్ కి బయలుదేరిన మలేషియన్ బోయింగ్ 777 ఎమ హెచ్ 17 ని ఉక్రైన్ సరిహద్దులో క్షిపణితో పేల్చివేయగా అందులో ప్రయాణం చేస్తున్న 298 మంది మరణించారు.  అందులో లభించిన 219 శవాలను మిలిటెంట్ లు స్వాధీనం చేసుకున్నారు.      

టోరేజ్ స్టేషన్లో ఉన్న రైలు అక్కడి నుండి వెళ్ళిపోయిందని ముందు వార్తలు వచ్చినా ఆ తర్వాత ఆ రైలు అక్కడే ఉందని తెలిసింది.  డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ వేర్పాటు ఉద్యమ సంస్థకు తనకు తానుగా ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న అలెగ్జాండర్ బోరోడాయ్.  బోరోడాయ్ తన చర్యను సమర్థించుకుంటూ తన సైనికులు మృతిచెందినవారి కుటుంబాలకు గౌరవమిస్తూ శవాలను అక్కడి నుండి తరలించామని అన్నారు.  వాటిని రిఫ్రెజెరేటెడ్ ట్రైన్ లో పెట్టామని, వైద్యనిపుణులు వచ్చేంత వరకు అవి అక్కడే ఉంటాయని అన్నారు.  ఇంకా, వేడి ఎక్కువవటం వలన, కుక్కల బెడద వలన శవాలు పాడై పోకుండా ఉండటం కోసమే వాటిని తరలించవలసివచ్చిందని కూడా బోరోడాయ ప్రకటించారు.  

ukraine-sepratists-lift-bod

యూరోపియన్ దేశాలన్నీ ఈ సంఘటన మీద స్పందిస్తూ, ఉక్రైన్ లో వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్థలంలో జరిగిన ఈ ఘటన మీద దర్యాప్తు చెయ్యటానికి రష్యా సహకరించాలని ఒత్తిడి తెస్తున్నారు.  దీని మీద అమెరికన్ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ మాట్లాడుతూ, అక్కడ పరిశీలించవలసిన సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నాయని,  అందుకు రష్యా సహకరించాలని చెప్తూ, ఈ ఘటనలో బాధ్యత వహిస్తూ రష్యా ఇవ్వవలసిన వివరణ చాలా ఉందని అన్నారు.  

అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్, జర్మన్ ఛాన్సలర్, బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా దర్యాప్తుకు రష్యా సహకరించాలని అన్నారు.

విషాదకరమైన విమానాన్ని కూల్చివేసిన ఘటనలో చిన్న పిల్లలు, విహారయాత్రకు వెళ్ళిన 80 మంది యువత కూడా ఉన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles