Home deliveries pushing instant foods to wall

Home deliveries pushing instant foods to wall, Home deliveries compete with packed food, Instant food lose due home deliveries

Home deliveries pushing instant foods to wall as ITC observes

ప్యాక్డ్ ఫుడ్ వాళ్ళ పొట్టగొట్టే హోమ్ డెలివరీలు

Posted: 07/21/2014 07:01 PM IST
Home deliveries pushing instant foods to wall

ఫుడ్ హోం డెలివరీలతో ప్యాక్డ్ ఫుడ్ ఇన్స్ స్టెంట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మార్కెట్ లో తట్టులేకపోతున్నారు.  వంటచెయ్యటానికి శుభ్రంగా తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, తక్కువ శ్రమతో వంటచేసుకోవటానికి ఇన్ స్టెంట్ ఫుడ్స్ మాత్రమే కాకుండా వెంటనే తినటానికి వీలుగా ఉన్న పాక్డ్ ఫుడ్స్ కూడా హోమ్ డెలివరీ వ్యాపారులతో పోటీ చెయ్యలేకపోతున్నాయి.  

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అని, ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళకి పిండ్లు, రవ్వలు, పరిశుభ్రం చేసిన ఆహార దినసులే కాకుండా కేవలం వేడి చేసుకుని తినే ఆహారం, లేదా కేవలం ప్యాకెట్ విప్పుకునే తినే ఆహార పదార్థాలను అలవాటు చెయ్యటంతో, అంతకంటే సులభంగా ఇంటి గడప దగ్గరికి వచ్చి డెలివరీ ఇచ్చే వ్యాపారుల సేవలు ఇంకా ఆకర్షణీయంగా కనపడటంతో వినియోగదారులు వాటికే మొగ్గు చూపిస్తున్నారు.  

దాదాపు అన్ని రెస్టారెంట్లూ హోమ్ డెలివరీ చేస్తుండటం, వినియోగదారులను సభ్యులుగా చేర్చుకుని ఫోన్ మీద కానీ ఇంటర్ నెట్ ద్వారా కానీ ఆర్డర్ తీసుకోవటం చేస్తుండటంతో గత కొద్ది సంవత్సారాలలో అలా ఆర్డర్ చేసే వారి సంఖ్య రెట్టింపయిందని ఐటిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కురుష్ గ్రాంట్ అన్నారు.  ఐటిసి, గిట్స్, ఎమ్టిఆర్ ఉత్పాదనలు ఇన్స్ స్టెంట్ ఫుడ్స్ ఉత్పాదనలో పోటీదార్లు.

ఒకప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మే మాల్స్ లో షాపింగ్ చేసి చేసే అలవాటున్న మహిళలు కూడా హోం డెలివరీకి అలవాటు పడుతున్నారంటే అందులో ఉన్న సౌలభ్యమే కారణం.

అయితే ఇందులో ఆదుర్దా పడాల్సిందేమీ లేదంటున్నారు కొందరు వ్యాపారులు.  ముంబై చెన్నై లాంటి నగరాలలో ఈ మార్పు వస్తుందేమో కానీ మిగతా ప్రదేశాలలో మధ్య తరగతి కుటుంబాలలో ఇప్పటికీ ఎవరి ఇంట్లో అలవాటైన రుచికి వారు ప్రాధాన్యతనిస్తూ ఇంట్లో చేసుకోవటానికే ఇష్టపడుతున్నారని, స్టాండర్జైజ్ చేసిన ఆహార పదార్థాలను గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకుంటారు లేదా నెలకి ఒకరోజు మార్పు కోసం తీసుకుంటారు కానీ పూర్తిగా డోర్ డెలివరీల మీద ఏ దేశంలోనూ ఆధారపడలేదని, ప్రతి వ్యాపారంలోనూ ఎవరికుండే కస్టమర్లు వాళ్ళకుంటారని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles