Blind school correspondent canes lads mercilessly

blind school, caning, correspondent, Teacher Brutally Canes Visually Handicapped Students, blind students, green, field, bilnd, school, students, Blind school, correspondent, beatenup, by, students, parents, in, kakinada, blind students, beatenup, by school, correspondent, in, andhra pradesh, Blind teacher, who, punished, blind students, beatenup, by, students, parents, in, kakinada.

blind school correspondent canes lads mercilessly, Teacher Brutally Canes Visually Handicapped Students

అంధ పిల్లలను చితకబాధిన కరెస్సాండెంట్!

Posted: 07/21/2014 04:59 PM IST
Blind school correspondent canes lads mercilessly

చిన్న పిల్లలు దేవుడితో సమానం. అదీ కూడా అంధు విద్యార్థులు అంటే దేవం మన కళ్లముందే ఉన్నట్లు. అంలాటి అంధ విద్యార్థులపై పాఠశాల కరెస్సాండెంట్ తన ప్రతాపం చూపించారు. కాకినాడ, సర్పవరం జంక్షన్, తిమ్మాపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాలలో నిర్వాహకుడు కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లు పిల్లలలను పైశాచికంగా కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

ఈనెల 18వ తేదీ గురువారం అల్లరి చేశారంటూ సాయి, సురేంద్ర, జోసెఫ్ లను వారు విచక్షణా రహితంగా కర్రతో కట్టారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. స్వయంగా తాను కూడా అంధుడే అయిన పాఠశాల కరస్పాండెంట్, పిల్లలు అల్లరి చేశాడని ముగ్గురిని పట్టుకుని పేకబెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. వద్దు వద్దని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించలేదు. కళ్లు కనిపించక ఓ పిల్లాడు వేరేవైపు తిరిగి ఉంటే, 'ఒరేయ్ అటు కాదురా.. నేను ఇక్కడున్నాను ఇటు తిరుగు' అంటూ తనవైపు తిప్పుకొని మళ్లీ మళ్లీ బెత్తంతో వీపుమీద ఎడాపెడా బాదేశాడు. ఆయనకు మరో వ్యక్తి కూడా దగ్గరుండి సహకరించాడు.

blind-school-correspondent

బాలల హక్కుల కమిషన్ కు చెందని అచ్యుతరావు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. అసలు పిల్లల ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యకూడదని, అలాంటిది అంధుడని కూడా చూడకుండా చిన్నారి ఒంటిమీద వాతలు తేలేలా అంతలా కొట్టడం అత్యంత హేయమైన ఘటన అని మండిపడ్డారు.

అయితే ప్రిన్సిపల్ పైశాచికాన్ని కొందరు విద్యార్థులు రహస్యంగా వీడియో తీసి , మీడియాకు అంధించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోలనకు దిగారు. పాఠశాల ప్రిన్స్ పాల్ పై విద్యార్థుల బంధువులు దాడి చేయటం జరిగింది. దీంతో డీఈవో, అధికారులను, పోలీసులను వెంట పెట్టుకొని పాఠశాలకు వెళ్లటం జరిగింది. బాధిత విద్యార్థులను విచారించి , నిర్వహాకుడు కేవీరావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు సీఫోర్సు చేయటంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై విద్యార్థి సంఘలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles