Union budget commented as copy of congress budget

Union budget 2014, Union budget commented as copy of Congress budget, extension of Chidambaram budget by BJP, Comments on Union budget 2014 by NDA Govt

Union budget commented as copy of Congress budget

చిదంబరం బడ్జెట్ కి కాషాయ లిప్ స్టిక్?

Posted: 07/12/2014 10:45 AM IST
Union budget commented as copy of congress budget

మోదీ ప్రభుత్వం నుంచి ఆశించిన విప్లవాత్మకమైన బడ్జెట్ ఏమీ కాదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి చిదంబరం తయారు చేసిన బడ్జెట్ కి భారతీయ జనతా పార్టీ తన రంగు అద్దటం జరిగిందని ఎకనామిక్ టైమ్స్ లో 2014 బడ్జెట్ మీద చేసిన వ్యాఖ్యలో చెప్పటం జరిగింది.  ఆర్థికపరంగా దూరదృష్టితో చేసిన బడ్జెట్ కాదని, కేవలం సుగర్ కోటింగ్ ఇవ్వటానికే ప్రాధాన్యతనివ్వటం జరిగిందని కూడా ఆ వ్యాఖ్యలో పేర్కొనటం జరిగింది.  

ఎవరు బడ్జెట్ తయారు చేసినా అది దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి కోసమే కదా.  అయినా ప్రతిసారీ ప్రతి బడ్జెట్ మీద ప్రతిపక్షాల వ్యాఖ్యలు మామూలైపోయాయి.  అధికార పక్షం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలు చాలా బాగున్నాయని ఏ ప్రతిపక్షమూ ఎప్పుడూ అనలేదు.  అందువలన ఈ సారి వచ్చే వ్యాఖ్యానాలలో ప్రత్యేకత ఏమీ లేదు కానీ పరస్పర ఖండన చేస్తున్నట్లుగా మాత్రం ఉన్నాయి.

అది మేము చేసిన బడ్జెట్ లోని అంశాలే భాజపా కాపీ కొట్టిందన్నది కాంగ్రెస్ నాయకుల వాదనైతే, అది బాగోలేదు, దూరదృష్టి లోపించింది, కేవలం లాండ్రీ లిస్ట్ లా కనిపిస్తోంది, అన్న మాటలు తిరిగి వాళ్ళకే తగులుతాయని అర్థం చేసుకోలేకపోవటం శోచనీయం.  

అసలింతకీ ఐడియా ఎవరిదన్నది ముఖ్యమా లేక ప్రజాహితంలో ఉందా లేదా అన్నదా.  ఒకవేళ బడ్జెట్ లో లోపాలుంటే దానిమీద చర్చలు చేసి సరిచేసుకోవటానికి, తద్వారా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికే కాకుండా యావద్భారతదేశానికే ప్రయోజనాన్ని కలుగుజేసే ప్రయత్నం చెయ్యటానికి పార్లమెంట్ లో ఉభయ సభలున్నాయి.  అది చెయ్యకుండా కేవలం మీడియాలో వ్యాఖ్యానాలను చెయ్యటం వలన ఏం సాధించదలచుకున్నారో ఆ నాయకులకే తెలియాలి.  బడ్జెట్ కేవలం ప్రతిపాదనే.  దానిలో లోపాలను ఒకవేళ గమనిస్తే వాటిని చట్ట సభల్లో సభ్యులందరి దృష్టికీ తీసుకునివచ్చి వాటిని తొలగించే ప్రయత్నం చెయ్యటమే చెయ్యవలసిన పని కాని, ఆ అంచనాలు, లెక్కలు కాపీ కొట్టినవి,  నిజానికి అవి మా ఐడియాలే అని చెప్పటం బాధ్యతగల నాయకులు చెయ్యవలసిన పని కాదని వాళ్ళకు కూడా తెలుసు కానీ రాజకీయంగా ఎదగాలంటే అలా మాట్లాడాలేమో, అధికారంలో ఉన్న పార్టీ అన్న ప్రతిదాన్ని విమర్శిస్తేగాని మనుగడ ఉండదేమో అన్నది ప్రతిపక్షాలకు అలవాటైపోయింది.

ఒక చట్టం చట్ట సభల్లో రూపు దిద్దుకుందంటే అది పార్టీలకు అతీతంగా అందరి సభ్యుల సమిష్టి కృషి ఫలితమే అన్న స్పూర్తి వచ్చిన రోజునే నిజంగా దేశంలో ప్రజాస్వామ్యం పురివిప్పి నాట్యం ఆడినట్లుగా భావించాలి.  పార్టీ తరఫున పనిచేసారు, ఎన్నికలలో పోటీచేసారు, కొందరు గెలిచారు, కొందరు ఓడారు, ఆ ప్రక్రియ అయిపోయింది.  ఇక మిగిలింది అందరూ కలిసి దేశాన్ని నడపటం అన్న దృష్టికోణంలో ఆలోచించి తమ విద్య, మేధస్సు, అనుభవాలను కలిసికట్టుగా దేశాభ్యుదయం కోసం ఉపయోగించే రోజులు వస్తాయేమో వేచి చూద్దాం!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles