Kcr comments on modi objected by pawan kalyan

KCR comments on Modi objected by Pawan Kalyan, Union budget 2014, Budget favors to AP state

KCR comments on Modi objected by Pawan Kalyan

పెద్దవాళ్ళతో పెట్టుకోవద్దన్న పవన్!

Posted: 07/12/2014 09:25 AM IST
Kcr comments on modi objected by pawan kalyan

మోడీయా గీడీయా అంటూ ఎన్నికల ముందు నరేంద్ర మోదీని తూలనాడిన కెసిఆర్ కి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పుడే తెలియజెప్పారు అలాంటి మాటలు మాట్లాడవద్దని.  నన్ను తిట్టినా సహిస్తాను కాని మోదీ గారిని ఏమన్నా నేను సహించలేనని కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజే అన్నారు.  అయితే ఇప్పడు అదంతా ఎందుకు గుర్తుకొస్తోందంటే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా విషయంలో అన్యాయం చేసారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పట్లో చూపించిన మాట దురుసేనని తెరాస లో కూడా కొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి.  

రేప్పొద్దున ఆయన ప్రధాన మంత్రి అవటం ఖాయం, మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండటం అవసరం అని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించటం జరిగింది.  అదంతా గుర్తుకొచ్చిన కొందరు నాయకులు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులను చూసి వేదన చెందటం సహజమే.  పైగా విడిచి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కేమో వరాల మూటలు అందించటం జరిగింది.  

అయితే ఇదంతా కేవలం ఊహాజనితమే.  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పట్లా సమానంగా వ్యవహరిస్తుంది.  నిజం చెప్పాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలో ఉండటం వలన ఆంధ్రప్రదేశ ని అసలు పట్టించుకోనేలేదు.  ఇంకా మిత్ర పక్షాలు ఎక్కడ అలకచెందుతాయో, చేయి వదిలిపెడతాయో అని ఆ పార్టీలకు కాస్తంత మొగ్గు చూపించారు కానీ అదే పార్టీ పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎంతమాత్రం విలువివ్వలేదు.  అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నే అప్పుడు పట్టించుకోలేదు.  రాష్ట్ర విభజన వలన రెండు ప్రాంతాలలోను కాంగ్రెస్ లేకుండా పోతుంది, అదే నా బాధంతా అని చెప్పినా పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ పార్టీ లా కాకుండా భారతీయ జనతా పార్టీ సమతౌల్యత పాటిస్తోందని తెలుస్తోంది.  

కాబట్టి అప్పుడేదో కెసిఆర్ అన్న మాటలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అందుకు బదులుగా తెలంగాణా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారన్న మాటలు నిరాధారమైనవి.  పాత ప్రభుత్వం చేసిన వాగ్దానాలను దృష్టిలో పెట్టుకుని, ఆదాయ వనరులు తగ్గిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఆర్థికంగా సాయపడటమే ఉద్దేశ్యంగా కనపడుతోంది కానీ ఆ ప్రాజెక్ట్ లతో పోల్చి తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేసారని, అందుకు కెసిఆర్ కారకులని అనటం సరికాదు.  

ఎన్నికల సమయంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల శ్రేయస్సులో, తమ పార్టీ ప్రయోజనంలో ఎన్నో మాటలు అంటారు.  అవన్నీ వ్యక్తిగత ధూషణలు కాజాలవు కదా!  పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం కూడా హితవు చెప్పాలనే కానీ నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కక్ష్య సాధించే మనిషని ఆయన ఉద్దేశ్యం కాదు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles