Indian nurses in iraq s tikrit moved are in isis captivity

Indian Nurses in Iraq-s Tikrit Moved- Are In ISIS Captivity, 46 Indian nurses in ISIS captivity in Iraq, Indian nurses in Iraq move, Indian nurses in Iraq move

Indian Nurses in Iraq-s Tikrit Moved- Are In ISIS Captivity, 46 Indian nurses in ISIS captivity in Iraq, Indian nurses in Iraq move

శవపేటికలు పంపండి... శవాలుగా తిరిగొస్తాం!

Posted: 07/04/2014 01:11 PM IST
Indian nurses in iraq s tikrit moved are in isis captivity

ఇండియా అధికారులకు ఒక విచిత్ర ప్రశ్న ఎదురైంది. అంటే మన అధికారులు ఎలా నిద్రపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. ‘‘ప్రమాదంలో ఉన్నాం కాపాడండి మహాప్రబో అని వేడుకుంటుంటే.. అంతగా ప్రమాదం లేదని ఇండియాలో ఏసీ రూంలో కూర్చున్న మన అధికారులు చెబుతున్నారు. కానీ ఇరాక్ లో మిలిటెంట్ల చెరలో చిక్కుకొని అల్లాడిపోతున్న 46 మంది భారతీయ నర్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఇప్పటికి నెల రోజులు గడుస్తున్న మన ప్రభుత్వం భారత నర్సుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో భారత నర్సులు ఆవేశంగా భారత ప్రభుత్వం ఇప్పటికే ఎంతో సమయం వృథా చేసిందని, శవపేటికలు పంపితే శవాలుగానైనా తిరిగొస్తామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల క్రితం తిక్రిత్ పట్టణంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు 46 మంది భారత నర్సులను బందీలుగా పట్టుకున్నారు.

ప్రస్తుతం వారిని మరో ప్రదేశానికి తరలిస్తుండడంతో నర్సుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోనా జోసెఫ్ అనే నర్సు ఫోన్ ద్వారా భారత మీడియాతో మాట్లాడారు. తరలింపు ప్రక్రియను తాము సున్నితంగానే వ్యతిరేకిస్తున్నా, ప్రస్తుతం తీవ్రవాదుల స్వరంలో మార్పు వచ్చిందని తెలిపారు. వారు కటువుగా వ్యవహరిస్తుండడంతో తాము వారి ఆజ్ఞలను పాటించకతప్పడంలేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఏమైన మన భారత నర్సుల పరిస్థితి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందని కొన్ని మహిళలు సంఘాలు అంటున్నాయి. భారత ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles