Act amendments in andhra pradesh

Act Amendments in andhra pradesh, andhra pradesh government, AP Reorganisation Bill, Lok Sabha.

Act Amendments in andhra pradesh, AP Reorganisation Bill as introduced in Lok Sabha

ఏపీలో చట్ట సవరణలు!

Posted: 07/04/2014 12:43 PM IST
Act amendments in andhra pradesh

ఆంద్రప్రదేశ్ లో చట్ట సవరణలు చేయటానికి కేంద్రం అడుగులు వేస్తుంది. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ లో ఐఐటీ , ఐఐఎం వంటి సంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానిిక అవసరమైన చట్ట సవరణలను చేయాలని కేంద్రం మాన వనరుల శాఖ భావిస్తోంది.

అలాగే గత ప్రభుత్వ హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ను విభజించే బిల్లు చట్లమైనా, తెలంగాణ ఏర్పాటు తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎం, ఐఐటీ, సెంట్రల్‌ వర్సిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చట్టాలు చేయలేదు లేదా సవరించలేదు. దేశ వాప్తంగా ఆయా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిపికెట్ల ఎలక్ర్టానిక్‌ డేటాబేస్‌ను రూపొందించేదుకు కూడా రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోనే మానవ వనరుల శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులు పొందే డిగ్రీలకు నకిలీలు రూపొందే అవకాశం లేకుండా దేశవ్యాప్త ఎలక్ర్టానిక్‌ డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించినా, లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం రాక, అలాగే మరుగునపడిపోయింది.

అయితే ఇప్పుడు అదే బిల్లును ఎన్‌డీఏ ప్రభుత్వం చట్టంగా రూపొందిచే ప్రయత్నం చేస్తోంది. ఈ డేటాబేస్‌ ఏర్పాటు చట్టమైతే, జాతీయ అకడమిక్‌ డిపాసిటరీని కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ డేటాబేస్‌ రూపకల్పనకు ప్రైవేట్‌ సంస్థల సాయం తీసుకోవాలని గత బిల్లులో ప్రతిపాదించినా, ప్రస్తుత బిల్లులో యూజీసీ, ఏఐసీటీఈ, సీబీఎస్‌ఈ వంటి సంస్థల సాయంతో ఏర్పాటు చేస్తారు. విజయవాడ, భోపాల్‌లోని స్కూల్‌ ఆప్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌పీఏ) విద్యార్థులు తమ డిగ్రీలు పొందేలా చట్ట సవరణలు చేసే అవకాశం ఉంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles