Delhi agra india s fastest train

delhi-agra india’s fastest train, fastest train flagged off from delhi, faster than shatabdi train flagged off from delhi, delhi agra fastest train to reach in 90 minutes

delhi-agra india’s fastest train

అతివేగవంతమైన ఢిల్లీ-ఆగ్రా రైలు

Posted: 07/03/2014 01:36 PM IST
Delhi agra india s fastest train

ఢిల్లీ నుంచి తాజ్ మహల్ వలన ప్రసిద్ధ పర్యాటక స్థలమైన ఆగ్రాకి అతి వేగవంతమైన రైలును ఈ రోజు ట్రయల్ రన్ లో బయలుదేరింది.  గంటకి 160 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ రైలు ఢిల్లీ నుంచి ఆగ్రాను 90 నిమిషాల్లో చేరుకుంటుంది.  అంటే ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన శతాబ్ది ఎక్స్ ప్రెస్ కంటే 30 నిమిషాల వేగంగా చేరుకుంటుందన్నమాట.  శతాబ్ది వేగం గంటకు 150 కిలోమీటర్లు.  

అంతా అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ నుంచి ఈ రైలు సేవలను ప్రవేశపెడతారు.  ఈ రోజు ట్రయల్ రన్ లో ఈ ఫాస్టెస్ట్ ట్రైన్ 10 బోగీలతో పోయి ఈ రోజే తిరుగు ప్రయాణం కూడా చేస్తుంది.  

దీన్ని 5400 హెచ్ పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్ తీసుకెళ్తుంది.  అయితే, రైలు వేగంగా వెళ్ళాలీ అంటే ఇంజన్ సామర్థ్యం ఒక్కటే సరిపోదు.  పట్టాల సామర్థ్యం, అంత వేగంతో ఎంత వంపు తిరగగలదే అంతే వుండటం, బోగీల సంఖ్య, వీటన్నిటితో పాటు ట్రాఫిక్ ప్రాధాన్యతలు దోహదం చేస్తాయి.  ఢిల్లీ ఆగ్రాల మధ్య 16 ప్రదేశాలలో వేగాన్ని తగ్గించవలసిన అవసరం ఉండేదని, వాటిని అప్ గ్రేడ్ చేసామని ఢిల్లీ డివిజన్ డిఆర్ఎమ్ అనురాగ్ సచిన్ తెలియజేసారు.  స్పీడ్ ట్రైన్ కోసం ట్రాక్ రెడీ చెయ్యటానికైన ఖర్చు 15 కోట్ల రూపాయలు.  

ఢిల్లీ ఆగ్రా స్పీడ్ ట్రైన్ సేవలు విజయవంతమైతే ఇదే విధంగా కాన్పూరి కి చండీగఢ్ కి కూడా విస్తరించే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles