Telangana local and non locals

telangana locals issue, fees reimburesement plan of stat govt, telangana local and non locals, telangana peoples, ration cards issue

telangana local and non locals

తెలంగాణా స్థానికతలో రెండు దృష్టికోణాలు

Posted: 07/03/2014 01:29 PM IST
Telangana local and non locals

తెలంగాణా రాష్ట్రంలో నివాసముంటున్నవారికి రేషన్ కార్డ్ లు ఇవ్వము అని తెలంగాణా ప్రభుత్వం అనలేదు.  గ్యాస్ సబ్సిడి, మౌలిక సదుపాయాలు, ఆస్తీ ప్రాణాలకు భద్రత, ఇవన్నీ అందరికీ సమానమే.  వ్యాపారావకాశాలు కూడా అందరికీ సమానమే.  కట్టవలసిన పన్నులూ సమానమే.  కేవలం ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, విద్యార్థుల ఫీజు చెల్లింపులలోనే తెలంగాణా ప్రభుత్వం పట్టుబడుతోంది.  ఉద్యోగావకాశాలకు చెందిన స్థానికత గురించి మార్గదర్శకాలింకా వెలువడలేదు కానీ విద్యార్థుల ఫీజు చెల్లింపుల విషయంలో మాత్రం 1956 వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ సంవత్సరం నుంచి ఉన్నవారినే ఫీజు చెల్లింపుల విషయంలో స్థానికత ఉన్నట్లుగా గుర్తిస్తోంది.

ఇది తెలంగాణా బడ్జెట్ కి సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వానికున్న ఆర్థిక వెసులుబాటులో ఎవరికి ఫీజులను చెల్లించాలి అన్నది నిర్ణయించుకునే అధికారం తెలంగాణా ప్రభుత్వానికుంది.  

ఋణ మాఫీల విషయంలో ఎలాగైతే లక్షరూపాయల పరిమితి వరకు చేస్తామని, పంట ఋణాలమీద మాత్రమే మాఫీలుంటాయని చెప్పినట్లుగా రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు.  దాన్ని అన్యాయం అక్రమం అనవలసిన అవసరం లేదు.  కాకపోతే ఇప్పటివరకు కలిసివున్నాం కాబట్టి, తెలంగాణా విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ వనరులు గణనీయంగా తగ్గిపోయాయి కాబట్టి ఈ సందర్భంలో ఫీజు రియంబర్స్ మెంట్ కి అర్హత దక్కనివారికి కాస్త మనస్తాపం కలిగే అవకాశం ఉంది.  

రైతు ఋణమాఫీల మీద కూడా నిరసనలు వచ్చాయి కానీ ఫీజు రియంబర్స్ మెంటు విషయంలో వచ్చిన నిరసనలు వేరేవిధంగా ఉన్నాయి, తెలంగాణా విద్యార్థుల ఫీజు చెల్లిస్తాం కానీ ఆంధ్రా విద్యార్థుల ఫీజుని మేమెందుకు చెల్లిస్తాం అనే బదులు మేము 1956 సంవత్సరంలోని స్థానికతనే పరిగణనలోకి తీసుకోగలుగుతాం అని ఉంటే దాని ప్రభావం మరోలా ఉండివుండేదేమో.  ఆ తర్వాత తెలంగాణాలో ఉన్నవాళ్ళు కూడా తెలంగాణా స్థానికులే కానీ వాళ్ళకు మేము ఈ పథకంలో పైసలు ఇవ్వలేము అని కూడా అని ఉండవచ్చు.  

అందరూ రాష్ట్రవాసులే కానీ కేవలం వికలాంగులకే ఫలానా రాయితీ ఇస్తాము లేదా ఫలానా వెనకబడిన కులాలకే ఫలానా ప్రయోజనాన్ని కలిగిస్తాము అని అన్నట్లుగానే దీన్ని కూడా భావిస్తే వచ్చే వ్యతిరేకతలుండవు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles