Sunanda pushkar death case new angle

sunanda pushkar death case, sunanda pushkar case new angle, aiims doctor accuses tharoor, sunanda pushkar’s mysterious death, shashi tharoor wife mysteriaou death, gulam nabi azad aiims president instructions, dr sudheer gupta affidavit in sunanda pushkar case, aiims ghulam nabi azad

sunanda pushkar case new angle

మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కేసులో కొత్త మలుపు

Posted: 07/02/2014 10:51 AM IST
Sunanda pushkar death case new angle

మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య అనుమానస్పదమైన పరిస్థితులలో ఫైవ్ స్టార్ హోటల్లో మరణించిన కేసు కొత్త మలుపులు తిరిగింది.  ఇప్పటివరకు అంతు తెలియకుండా ఉన్న ఈ కేసులో ఆల్ ఇండియా మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో పని చేసే సీనియర్ డాక్టర్ వాంగ్మూలంతో కొత్త కోణం బయపడింది.  

ఎయిమ్స్ లోని డాక్టర్ సుధీర్ గుప్తా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్ర మంత్రి, ఎయిమ్స్ ప్రెసిడెంటైన గులామ్ నబీ ఆజాద్ తనని తన వృత్తికి వ్యతిరేకంగా సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన విషయాలను కప్పిపుచ్చటం కోసం ఒత్తిడి చేసారని పేర్కొన్నారు.  

ఒకపక్క ఎయిమ్స్ ప్రెసిడెంట్ గులామ్ నబి ఆజాద్, మరోపక్క మృతి చెందిన సునంద పుష్కర్ భర్త కూడా ఆరోగ్య శాఖా మంత్రిగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులని, అందువలన అప్పట్లో ఈ విషయాన్ని చెప్పటానికి తనకి ధైర్యం లేకపోయిందని, డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు.  

సునంద పుష్కర్ శవపరీక్ష చేసిన వైద్యుల బృందానికి నాయకత్వే వహించిన గుప్తా తన నివేదికను గుప్తంగా ఉంచమని, అందుకే సీల్డ్ కవర్ లో ఇస్తున్నానని కోరారు.  ఆయన తను చేసిన ఆరోపణలకు ఆధారంగా ఎయిమ్స డైరెక్టర్, శశి థరూర్ మధ్య నడిచిన ఇమెల్స్ కాపీలను కూడా తన అఫిడవిట్ కి జతపరచారు.  

అయితే ఇదంతా ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే, ఎన్డియే ప్రభుత్వం రాగానే డాక్టర్ గుప్తా సీనియారిటీ ప్రమాదంలో పడింది.  ఆయన్ని శాఖాధికారి పదవి నుంచి తొలగిస్తున్నారని, డాక్టర్ ఒపి మూర్తికి ఆ పట్టం కడుతున్నారని తెలిసి ఆయన కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి డా.హర్షవర్ధన్ కి ఆ చర్య ఎయిమ్స్ నియమావళికి విరుద్ధమని లేఖ రాసారు.  

శశి థరూర్ భార్య సునంద పుష్కర్ తన భర్తకి, పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహ్ర్ తరార్ కి మధ్య సంబంధమున్నదని అంటూ ట్విట్టర్ లో విమర్శించిన కొన్ని రోజులలోనే ఆమె ఒక ఫైవ్ స్టార్ హోటల్లో శవంగా మారింది.  అయితే ఆ జర్నలిస్ట్ ఆరోపణ తప్పని చెప్పటం కూడా జరిగింది.  

సునంద పుష్కర్ చనిపోయిన విధానం ఎన్నో అనుమానాలను రేకెత్తించింది.  కానీ దేనికీ సమాధానం దొరకలేదు.  డాక్టర్ గుప్తా ప్రకటనలతో ఆ చిక్కుముడులు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.  దేశంలో జరిగే ఎన్నో విషయాల మీద బాహాటంగా ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ లు వేసే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసు మీద పలు అనుమానాలను వ్యక్తం చేసారు.  పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో శశి థరూర్ ఎందుకంత భయపడిపోయారని కూడా ఆయన అప్పట్లో ప్రశ్నించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles