New capital of andhra pradesh between vijayawada and guntur

new capital in andhra pradesh, capital of andhra pradesh between vijayawada and guntur, chief minister n chandrababu naidu, ap cm, ap new capital, andhra pradesh capital, amravati, land between guntur and vijayawada

capital of andhra pradesh between vijayawada and guntur

రాజధాని నిర్మాణానికి పరిశీలనలో అమరావతి

Posted: 07/02/2014 09:40 AM IST
New capital of andhra pradesh between vijayawada and guntur

విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మొగ్గు చూపిస్తున్నా, ఆ ప్రాంతంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  పైగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక నున్న నంబూరు, లామ్ మొదలైన ప్రాంతాలలోని భూమి సారవంతమైనది కావటంతో దాన్ని నిర్మాణాలకు ఉపయోగించదలచుకోలదని సమాచారం.  ఇప్పుడు తాజాగా అమరావతిని రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందన్నదానిలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి.  

అమరావతి రాజధానిగా మారితే అది నదీప్రాంతంలో ఉంటుంది కాబట్టి నీటికి కొదవు ఉండదనే అభిప్రాయం ఉన్నా, వరదలు వస్తే ఎలా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  అమరావతి మండలంలో 10929 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఉన్నట్లుగా రికార్డ్ లు తెలుపుతున్నాయి.  తాడికొండ మండలంలో ఉన్న 6982 ఎకరాలను, అచ్చంపేటలో ఉన్న 16327 ఎకరాల భూమిని కూడా పరిశీలిస్తున్నారు.  

కొత్త రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చెయ్యటానికి రోడ్లు, కృష్ణా నదికి ఇరువైపులా రాజధాని విస్తరించేలా వంతెనల నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచన కూడా నలుగుతోంది.  గొల్లపూడి నుండి మంగళగిరికి ఇప్పటికే వంతెన కట్టటానికి భూసేకరణ పూర్తయింది.  అలాగే కంచికచర్ల నుంచి అమరావతికి, నందిగామ నుండి అచ్చంపేటకు కూడా వంతెనలను నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది.  

మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆలోచనలో నదీజలాలలతోను, వంతెనలు, రోడ్లతోనూ నిండిన రాజధాని నగరం రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది.  అప్పుడే నగరం సుందరంగా కనపడుతుంది, అన్నిరకాల సదుపాయాలతో విలసిల్లుతుంది కాబట్టి రాజధాని నగరం మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.  ఆ నిర్ణయం జరిగితేకానీ మిగతా పనులు వేగాన్ని అందుకోవు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles