Chandrababu releases crop loan program for 91459 crore

chandrababu releases crop loan program for 91459 crore, slbc meeting in hyderabad, bankers promise to go by government schemes, bankers cooperation for government welfare schemes

chandrababu releases crop loan program for 91459 crore

ఆం.ప్ర. ఋణ ప్రణాళిక రూ.91459 కోట్లు

Posted: 07/01/2014 12:44 PM IST
Chandrababu releases crop loan program for 91459 crore

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-15 కి గాను ఋణప్రణాళికను విడుదల చేయగా, అది రూ.91,459 కోట్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది.

హైద్రాబాద్ లోని క్షత్రియ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఛైర్మన్ సివిఆర్ రాజేంద్రన్ మాట్లాడుతూ, బ్యాంక్ ఋణ మాఫీల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని అన్నారు.  రాష్ట్రంలో ఉన్న 5980 బాంక్ శాఖల్లో 68 శాతం గ్రామీణ, సెమి అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయని, అతి ముఖ్యమైన ఖరీఫ్ ఋణాలకోసం బ్యాంకులు రూ.56019 కోట్ల రూపాయలను రైతు ఋణాలకు ఇవ్వటానికి నిర్ణయించుకుని, అందులో రూ.41978 కోట్ల రూపాయలను సత్వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.  మిగిలిన 14041 కోట్ల రూపాయలను నాబార్డ్ సూచనల మేరకు టర్మ్ లోన్ గా ఇవ్వటానికి కేటాయించామని కూడా ఆయన అన్నారు.  

అయితే నాయకులు చేసిన ఋణమాఫీల హామీలతో రెండు సంవత్సరాలుగా రైతులు ఋణాలను చెల్లించటం లేదని, అంతేకాకుండా ఋణాలను సకాలంలో చెల్లించటం వలన కలిగే లాభాలను వివరిస్తూ రైతులు చైతన్య పరచటానికి వెళ్తున్న సిబ్బందిని అడ్డుకుంటున్నారని దానితో బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటోందని ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చెయ్యటం జరిగింది.  

పోయిన సంవత్సరం బ్యాంక్ లు 37058 కోట్ల రూపాయల పంట ఋణాలను మంజూరు చెయ్యగా, ఈ సంవత్సరం దాన్ని వృద్ధిచేస్తూ, రూ.41978 వరకు పెంచామని కూడా ఈ సమావేశంలో చెప్పటం జరిగింది.

ఋణమాఫీల సంగతి ఇంకా స్వష్టత రావలసివుందని, అయితే ప్రభుత్వం అమలు పరచదలచుకున్న అన్ని పథకాలకు బ్యాంకింగ్ రంగంనుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని కూడా రాజేంద్రన్ ప్రకటించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles