Telangana mandali chairman elections

telangana mandali chairman elections, srinivas gowd nomination for mandal chairman post, congress party candidate for mandal chairman from minority group, congress hopes on two majlis mlcs

telangana mandali chairman elections

తెలంగాణా కాంగ్రెస్ తెనాలి రాముని తెలివి!

Posted: 07/01/2014 01:11 PM IST
Telangana mandali chairman elections

పిల్లికి వేడి వేడి పాలిచ్చిన తెనాలి రామకృష్ణ కథ అందరికీ తెలిసిందే.  పాలంటే ఎంతో ఇష్టపడే పిల్లికి పాలు ఇచ్చినట్టూ అయింది, అది తాగలేకపోవటం, ఆ తర్వాత పాలంటే అయిష్టత చూపించటమూ జరిగింది.  

తెలంగాణా రాష్ట్ర సమితి తరఫునుంచి శాసనమండలి ఛైర్మన్ పదవికి శ్రీనివాస గౌడ్ నామినేషన్ ని దాఖలు చెయ్యగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థి ఫారూఖ్ హుస్సేన్ తో నామినేషన్ వేయించింది.  ఇందులో కాంగ్రెస్ పార్టీ ఔదార్యం చూపిస్తూ మైనార్టీ వర్గం పట్ల తమ ప్రేమాభిమానాలను చూపించినట్లూ అయింది, మరెవరూ ఓటమి పాలు కాకుండానూ జరిగింది.  ఎందుకంటే అది కచ్చితంగా ఓడిపోయే పోటీయేనని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు.  

ఓడిపోయే స్థానానికి మేమా, గెలిచే అవకాశముంటే అగ్ర కులాలకా, అంటూ మైనార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.  మైనార్టీ వర్గానికి అవకాశం ఇచ్చినంత మాత్రాన ఫలితాలు తారుమారవుతాయన్న ఆలోచనే గనక ఉంటే అది పిచ్చి ఆలోచనే.  మైనార్టీ వర్గానికి అవకాశమిస్తే మజ్లిస్ ఎమ్మెల్సీలు శ్రీనివాస్ గౌడ్ కి వ్యతిరేకంగా వోటేస్తారన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంటే మాత్రం అది తప్పిదమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles