Weather report hopeful of getting rains in 24 hours

Weather report hopeful of getting rains in 24 hours, Monsoon delayed, Rains may start in 24 hours as per weather report center

Weather report hopeful of getting rains in 24 hours

మరో 24 గంటలు వేడి భరించాల్సిందే!

Posted: 07/01/2014 09:34 AM IST
Weather report hopeful of getting rains in 24 hours

వర్షాలు మొదలయ్యాయో లేదో, లేక వర్షాలు పడితే ఎలా ఉంటుందో అని శాంపిల్ చూపిస్తున్నాయా అన్నట్లున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఊపందుకుంటున్నాయి.  

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2 నుంచి 5 వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనపడుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సూచిస్తోంది.  అక్కడక్కడ అరకొరగా పడే వర్షాలతో తాపమానం ఇంకా పెరిగిపోతోంది కానీ ఉపశమనం మాత్రం కలగటం లేదు.  వడగాలులు కూడా వీచే అవకాశాన్ని కూడా వాతావరణ సూచన కేంద్రం తెలియజేస్తోంది.  

అయితే బంగ్లాదేశ్ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది.  అది కాని జరిగితే దేశంలో వర్షాలు పడవచ్చని వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు.  అలా అల్పపీడనం ఏర్పడి వర్షాలు పడటానికి దోహదం చేసేందుకు ఇంకా 24 గంటల సమయం ఉంది కాబట్టి, ఈ లోపులో వేడికి మాడక తప్పదు.  

వేడి గాలులనుంచి మాత్రం జాగ్రత్తపడమని కూడా అధికారులు సూచిస్తున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles