(Image source from: digvijay singh and antoni controversial comments on congress party and rahul gandhi)
ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీ.... ఆ అవమానం నుంచి ఎలా బయటపడాలా అని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్న తరుణంలో... ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వివాదాస్పదమైన కామెంట్లు చేసి, మరిన్ని చిక్కుల్లో పడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయిన ఏకే ఆంటోని, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీని గందరగోళ పరిస్థితిలో పడేశాయి.
వారిలో ఏకే ఆంటోని... ‘‘కాంగ్రెస్ పార్టీ చాలావరకు ముస్లిముల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తోందన్న భావన హిందువుల్లో కలగడం వల్లే లోక్ సభ పోటీల్లో ఘోరంగా ఓడిపోయింది’’ అని కేరళలో సంచలనమైన వ్యాఖ్యలు చేసిపారేశారు. ముస్లింలతో ఏకపక్ష ధోరణిని ఎక్కువగా కనబరచడం వల్లే హిందువుల ఓట్ల మెజారిటీని కోల్పోయామని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లౌకికవాదంగా ప్రవర్తిస్తోందని అనుమానించిన ప్రజలు... ఈసారి ఆ పార్టీ ఓట్లు వేయలేదని వున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆయనను మందలిచ్చినట్టు కనిపిస్తోంది. తన అభిప్రాయాలను ఈ విధంగా బహిరంగంగా కాకుండా వర్కింగ్ కమిటీ లేదా కోర్ కమిటీలో చర్చిస్తే బాగుండేదని ఆయనకు సలహాలు ఇచ్చారట! ఈ విషయంపై కొందమంది వర్కింగ్ సభ్యులు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం! అయితే ఆంటోని కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం నుంచి కొనసాగుతున్నాడని, అలాగే సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు కావడంతో.. సోనియా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని కమిటీ సభ్యులు చర్చించుకుంటున్నారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన దిగ్విజయ్ సింగ్ కూడా గోవాలో ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసి, కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తీసుకొచ్చారు. ఆ పార్టీ ఉపాధ్యాక్షుడైన రాహుల్ గాంధీకి పార్టీనిగానీ, ప్రభుత్వాన్నిగానీ నడిపే సత్తాలేదంటూ తన మనసులో వున్న అభిప్రాయాన్ని బయటపెట్టేశారు. దీంతో ఆ పార్టీలో వున్న పెద్దలందరూ ఒక్కసారి ఖంగుతిన్నారు. ఒక పార్టీ సీనియర్ నాయకుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా అంటూ కమిటీ సభ్యులు గుసగుసలాడుకున్నారు.
అయితే ఈయన కూడా మొదటి నుంచి కాంగ్రెస్ తోనే కొనసాగుతున్న సీనియర్ నాయకుడే కాబట్టి.. ఈయనపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయనను సమర్థించినట్టు తెలుపుతున్నారు. మరికొందరు... ఆయన అటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా చెప్పాల్సింది కాదంటూ సలహాలు ఇచ్చారని చెబుతున్నారు. మరికొంతమంది నాయకులు డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ... ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా వస్తాయని ఆయనను ప్రశ్నిస్తున్నారు.
గతంలో కేరళ, రాజస్థాన్, మరికొన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శిస్తూ జోకర్ గా అభివర్ణించిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా బహిరంగంగా ఆ పార్టీకి తీవ్రంగా విమర్శించడం ఎంతవరకు సమంజసమని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యలపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more