(Image source from: greater hyderabad muncipal officials may collapse N convention center of nagarjuna)
తెలంగాణాలో వున్న అక్రమ కట్టడాలకు కూల్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలమేరకు అనుగుణంగా గ్రేటర్ మున్సిపల్ అధికారులు దుమ్ము దులిపేస్తున్నారు. ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మించిన కట్టడాలను, అలాగే అయ్యప్ప సొసైటీలో వున్న కట్టడాలు అక్రమంగా నిర్మించినవి అని నిర్ధారించి, కూలుస్తున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా అక్రమమని తేల్చి చెప్పి, దాన్ని కూల్చే పనిలో ముందుకు సాగుతున్నారు.
‘‘కేవలం ఒక వారం మాత్రమే సమయం ఇస్తున్నాం. ఇంతలోపూ స్పందిస్తే ఫర్వా లేదు... లేకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని మున్సిపల్ అధికారులు, నాగార్జునకు గట్టి వార్నింగ్ ఇచ్చారట! సోమవారం సాయంత్రం వరకు దీనిపై కేంద్రం ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు సమాచారం! ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని నిర్ధారించిన అధికారులు.. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ - 452 ప్రకారం వారం రోజులవరకు గడువుతో కూడిన ఒక నోటీసును జారీ యజమానికి జారీ చేయనున్నారు.
ఒకవేళ దీనికి అనుగుణంగా యాజమాన్యం స్పందించకపోతే... వారిచ్చిన నోటీసును గోడలమీద అంటించి, వారంరోజులకంటే ఎక్కువ గడువు ఇవ్వకుండా ప్రణాళికలను సిద్ధం చేస్తారు. గడువు పూర్తయినా కూడా సదరు యాజమాన్యంవారు తమ నిర్ణయాన్ని సరిగ్గా వెల్లడించకపోయినా.. అధికారులకు సమాధానం ఇవ్వకపోయినా... జీహెచ్ఎంసీ యాక్టులోని సెక్షన్-636 ప్రకారం మరో 24 గంటలతో గడువు కూడిన నోటీసును జారీ చేస్తారు. ఆ తరువాత చట్టప్రకారం అధికారులు తమ పనులను తాము చేసుకుంటూ పోతారు.
ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాదాపు 3.12 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైందని గ్రేటర్ హైదరాబాద్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో నిర్ధారించిపారేశారు. అలాగే తమ్మిడికుంటకు చెందిన 3 ఎకరాలా 12 గుంటల భూమిని కలుపుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 1.12 గుంటల భూమి ఎఫ్ టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోది అని, 2 ఎకరాల భూమి బఫర్ జోక్ కిందకు వస్తుందని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. వరదనీటికి ఎటువంటి నిర్మాణాలను చేపట్టకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా... నిబంధనలను అతిక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఎఫ్ టీఎల్, బఫర్ జోక్ విభాగానికి చెందిన భూములను ఆక్రమించుకోవడం అక్రమమేనని ఖరాఖండిగా తేల్చిపారేశారు.
దీంతో చట్టప్రకారం... ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫంక్షన్ హాలు నిర్మించినందుకు ఎటువంటి నోటీసులను జారీచేయకుండానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చవచ్చునని అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై నాగార్జునను ఎటువంటి సమాధానం రాలేదు. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారోనని, ఎవరి సహాయం తీసుకుంటారోనని ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more