Isro to launch pslv c 23 with 5 foreign satellites

pslv c-23 with 5 foreign satellites lifts off, isro to launch pslv c-23 with 5 foreign satellites, isro to launch pslv c-23, pslv c-23 lifts off, pslv-c23 launch is global endorsement, modi to witness launch of pslv c-23 rocket, pslv-c23 rocket carrying satellites of france germany canada and singapore

Isro to launch pslv c-23 with 5 foreign satellites

అంత.. మీ వల్లే...! మోడీ

Posted: 06/30/2014 11:42 AM IST
Isro to launch pslv c 23 with 5 foreign satellites

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్  నరసింహన్,  శాసన మండలి చైర్మన్ చక్రపాణి, కేంద్ర మంత్రలు వెంకయ్య నాయుడు, జితేంద్రసింగ్, రాష్ట్ర మంతి నారాయణ  సమక్షంలో  శ్రీహరికోటలోని  సతీష్ దవన్  అంతరిక్ష ప్రయోగం కేంద్రం   నుంచి  పీఎస్ఎళ్ వీ-సి23 9.52 గంటలకు  విజయవంతంగా నింగిలోకి  దూసుకెళ్లింది.

దీంతో ఇస్రోలోని శాస్త్రవేత్తలందరూ సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమవడంతో అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో మైలురాయిని దాటింది.  పిఎస్ఎల్ వి సి-23 వాహకనౌక ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

PSLV-C-23

మోడీ మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిగమించారని కొనియాడారు. సాంకేతిక రంగంలో దేశం ప్రగతి పథంలో దూసుకెళుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాలు చేసి విజయవంతమవడంలో భారత్ అగ్రదేశాల సరసన చేరిందని అభిలషించారు.

అంతరిక్ష రోధసీ రంగంలో భారత్ విజయం సాధించడానికి కారణం ఇండియా సొంత నేవిగేషన్ వ్యవస్థను సమకూర్చుకోవదమేనని కొనియాడారు. సి-23 రాకెట్ విజయం భారతీయులకు గర్వకారణమన్నారు. సాంకేతిక దేశాలతో పరిశోధనా రంగంలో భారత్ పోటీ పడుతోందని అభినందించారు. ఇప్పటి వరకు భారత్ 67 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

Modi-with-Scientist

అంతేకాదు.. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ది సుదీర్ఘ ప్రయాణమని కీర్తించారు. ఆర్యబట్ట నుంచి నేటి వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాల్లో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని కొనియాడారు. హాలీవుడ్ సినిమా గ్రావిటీ కన్నా మన చంద్రయాన్ ప్రయోగం ఖర్చు తక్కువని చెప్పారు. అందుకని భవిష్యత్ లో కూడా అంతరిక్ష పరిశోధనలకు అయ్యే ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుందని, మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేసి ఎన్నో ఎన్నెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles