Mp murali mohan calls on gail pipeline victims

MP Murali Mohan calls on GAIL pipeline victims, rajahmundry mp murali mohan, gail gas pipeline blast in east godavari, murali mohan visited hospitals in east godavari, gail pipeline victims, GAIL pipeline victims.

MP Murali Mohan calls on GAIL pipeline victims

ఎంపీగారి ఊరడింపు-గ్యాస్ మంటలు?

Posted: 06/28/2014 04:23 PM IST
Mp murali mohan calls on gail pipeline victims

కోనసీమలో గుండెల్లో.. గ్యాస్ మంటలతో  15 మంది  ప్రాణాలు తీసుకొని,  కొన్ని వందల మందికి   గాయలను చేసిన విషయం  దేశం మొత్తం షాక్ తిన్నది. దీంతో  రాజకీయ నేతల, రాజకీయ పార్టీలు,  అధికార యంత్రంగం  అంత  కోన సీమ నగరానికి  బయలుదేరి వెళ్లి .. గ్యాస్  పైపు లైన్  పేలుడు బాధితులను  ఒ పరామార్శించే పనిలో బిజీగా ఉన్నారు.

ఈరోజు   రాజమండ్రి  ఎంపీ మురళీమోహన్ .. నగరం గ్యాస్ పైపులైన్  పేలుడు బాధితులను  పరామర్శించేందుకు  కాకినాడ ప్రభుత్వాస్పత్రికి  వెళ్లటం జరిగింది. ఎంపీగారు బాధితులను ఊరడించే  సమయంలో.. కొంతమంది బాధితులు  ఎంపీ  మురళీమోహన్ వారి బాధలు చెప్పుకోవటం జరిగింది. తమ బతుకులు బుగ్గి అయిపోయాయని, కొబ్బరిచెట్లు మొత్తం కాలిపోయాయని, ఇళ్లు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని, అయినా ఎవరూ ఆదుకోలేదని అన్నారు. అంతేకాకుండా నిలువ నీడ కూడా లేకుండా పోయిన తమవాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సాయం కూడా అందించలేదని మరికొందరు మహిళలు ఆయన దృష్టికి తీసుకురాగా, అందరినీ సొంతమనుషుల్లా వారిని ఊరడించారు. కానీ ఇదే సమమయంలో కొంతమంది నకిలి బాధితులు ఎంపీని టార్గెట్ చేసుకోని, జగన్ పార్టీ ఉంటే.. మాకు న్యాయం జరిగేదని   ఎంపీ పై విరుచుకుపడ్డారు.

అక్కడ మాట్లాడుతున్న బాధితుల తీరు ఎలా ఉందంటే.. ‘‘మీకు న్యాయం చేస్తాం అని టిడిపి ఎంపీ మురళీ మోహన్ చెబుతున్నా’’ ఆయన మాటలు వినకుండా ..  ఎంపీ గో బ్యాక్ అంటూ.. నకిలి బాధితులు  నినాదాలు చేయటంతో.. ఎంపీగారికి  ఆవేశం కట్టలు తెంచుకుంది.  దీంతో ఎంపీ  ''మీడియా ఉండబట్టే కదా మీరింతగా రెచ్చిపోతున్నారు.. మీడియా ముందు వద్దు, లోపలకు రండి మాట్లాడుకుందాం రండి అని చెప్పిన వినిపించుకోకుండా.. ఎంపీ  విమర్శలు   కురిపించారు.  

తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని కొంతమంది బాధితులు ఎంపీ మురళీమోహన్ ను కాకినాడ ఆస్పత్రిలో నిలదీశారు. దీంతో  ఎంపీ సైలెంట్ గా ..అక్కడ నుండి వెళ్లిపోవటం జరిగింది.   ఆయన వెళ్లిన వెంటనే..నకిలీ బాధితులు కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. దీంతో  అసల బాధితులు ఎంపీకి  కష్టాలు చెప్పుకుందని వస్తే ఇలా జరిగిందేంటీ? అని  నగరం బాధితులు లబోదిబోమని ఏడుస్తూ.. నకిలీ బాధితులపై.. శాపనార్థాలు  పెడుతూ.. వచ్చే అధికారుల కోసం  ఆశగా ఎదురు చూస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles