Rosaiah tamil nadu and karnataks governor

rosaiah additional charge as karnataka governor, rosaiah tamil nadu and karnataks governor, esl narasimhan governor for ap and telangana, congress leaders acting as governors to leave

rosaiah tamil nadu and karnataks governor

రోశయ్య కూడా నరసింహన్ బాటలోనే

Posted: 06/28/2014 11:03 AM IST
Rosaiah tamil nadu and karnataks governor

అఖండ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను కూడా నరసింహన్ లాగానే జోడు రాష్ట్రాల సవారీకి పురమాయించటం జరిగింది.  

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రస్తుతం రెండు రాష్ట్రాలకూ ఇఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నట్లుగానే తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్న రోశయ్యకు అదనంగా కర్నాటక రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కూడా తాత్కాలికంగా చేపట్టవలసివస్తోంది.  

కర్నాటక గవర్నర్ భరద్వాజ పదవీ విరమణ చెయ్యటంతో రోశయ్యను అదనపు బాధ్యతలను తీసుకోమని ఆదేశించటం జరిగింది.  ఆయన త్వరలోనే కర్నాటక గవర్నర్ గా కూడా ప్రమాణస్వీకారం చేస్తారు.  

గవర్నర్ పదవులలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు భాజపా ప్రభుత్వం ఉద్వాసన చెప్పే ప్రయత్నంలో ఉంది.  కానీ ఆ స్థానాలను భర్తీ చెయ్యటానికి ఇంకా జాబితా పూర్తవనట్లుగా ఉంది.  అందువలన మిగిలిన గవర్నర్ లకు రాజీనామా చెయ్యమని పిలుపులు వెళ్ళినా నరసింహన్, రోశయ్యలాంటి వివాదరహిత నాయకులను ప్రస్తుతానికి భాజపా ప్రభుత్వం కదలించే ప్రయత్నాలేమీ చెయ్యలేదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles