Promotion of midwifery saves millions of lives

Promotion of Midwifery saves millions of lives, Johns, ohns Hopkins Bloomberg School of Public Health, maternal mortality can be prevented by midwifery

Promotion of Midwifery saves millions of lives

పేదదేశాలకు పెన్నిధిగా మంత్రసానులు

Posted: 06/26/2014 07:05 PM IST
Promotion of midwifery saves millions of lives

వైద్యులు లేని చోట మంత్రసానులు (మిడ్ వైఫ్) పేదలపాలిటి పెన్నిధిలా పనిచేస్తారు.  కాన్పులలో ప్రత్యేకమైన శిక్షణతో అదే పనిలో ఉండటం వలన వాళ్ళ అనుభవం అత్యవసర పరిస్థితుల్లో బాగా పనిచేస్తుంది.  

నాలుగు దశాబ్దాల వెనక్కి పోతే భారత దేశంలో కాన్పులు ఇళ్ళల్లోనే జరిగేవి.  పురిటి నొప్పలు వచ్చినప్పుడు మంత్రసానికి కబురుపంపేవారు.  మంత్రసాని వస్తూనే పరిస్థితిని అవగాహన చేసుకుని కావలసిన వస్తువులను అడిగి తీసుకుని కాన్పుకి కావలసిన ఉపచారాలను మొదలుపెట్టేది.  ఆ తర్వాత కాలంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన వ్యాధులు, కాన్పులలో విశేషమైన శిక్షణ పొందిన వైద్యులు రావటం, నెలనెలా టెస్ట్ లతో మొదటి నెలనుంచే వాళ్ళ నియంత్రణలోకి పోవటం మొదలైంది.

పూర్వకాలంలో సిజేరియన్ లు లేనేలేవు.  ఇప్పుడు వైద్య రంగం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత భారత దేశంలో నార్మల్ డెలివరీలే అరుదైపోయాయి.  

జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని శాస్త్రజ్ఞులు, పేద దేశాలకు సుశిక్షితులైన మంత్రసానులు బాగా ఉపయోగపడతారని అంటున్నారు. ప్రసవకాలంలో తల్లి పిల్లల మరణాలు ఎక్కువైపోతున్న సందర్భంలో వాటిని నివారించటానికి కొన్ని దేశాలు చేపట్టిన మార్గాలు కేవలం నామమాత్ర ఫలితాలనే ఇచ్చాయి.  అలాంటప్పుడు పేద దేశాలలో మంత్రసానులే బాగా ఉపయోగపడతారని శాస్త్రజ్ఞలు అంటున్నారు.  జూన్ 23 న ది లాన్ సెట్ లో వెలువడిన నివేదిక ప్రకారం తల్లిపిల్లలు గర్భం దాల్చిన దగ్గర్నుంచి ప్రసవం కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో చనిపోయారని తెలుస్తోంది.

అందువలన సుశిక్షితులైన మంత్రసానులను పేదరికంలో ఉన్న వివిధ దేశాలకు పంపించటం కూడా సత్ఫలితాలనిస్తాయని అంటున్నారు.  ఆ విధంగా చాలా క్లిష్టమైన సందర్బాల్లో కూడా తల్లి ప్రాణాన్ని కాపాడవచ్చని ఈ పరిశోధనలో నేతృత్వం వహించిన లిండా బార్లెట్, ఎమ్ డి, ఎమ్ హెచ్ ఎస్ సి అంటున్నారు.  ఈమె జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని అంతర్జాతీయ ఆరోగ్య విభాగానికి ఫాకల్టీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు.  
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తేడాను తెలుసుకోవటానికి కాన్పులలో మహిళలు ప్రాణాలు పోగొట్టున సంఖ్యను కొలమానంగా తీసుకుని నిర్ణయించవచ్చని అంటున్నారు లిండా బార్లెట్.  The Impact and Cost of Scaling up Midwifery and Obstetrics in 58 Low- and Middle-Income Countries" అనే పుస్తకాన్ని కూడా ఆమె రచించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles