Modi honeymoon over says ajit jogi

modi honeymoon over says ajit jogi, ajit jogi ex cm of chattisgar, ajit jogi comments on pm, political parties honeymoon restricted to 6 months.

modi honeymoon over says ajit jogi

హనీమూన్ ని రద్దుచేసి మోదీని వెనక్కి రమ్మంటున్న జోగి

Posted: 06/25/2014 01:00 PM IST
Modi honeymoon over says ajit jogi

పెళ్ళవగానే హనీమూన్ కి ఎందుకు వెళ్తారంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, కొన్నాళ్లు ఎటువంటి పని ఒత్తిడిలూ లేకుండా హాయిగా గడుపుతూ జీవితంలో ముందడుగు వెయ్యటానికి సిద్ధమవటానికి.   కానీ దానికీ ఓ లెక్కుంటుంది.  ఇంకా మేము అర్థం చేసుకోలేదు అంటూ హనీమూన్ లోనే సగం జీవితం గడిపెయ్యటానికి వీలుండదు.  అంతే కాదు హనీమూన్ లో ఇద్దరూ సఖ్యతగా లేకపోయినా, లేకపోతే ఇంటిదగ్గర వేరే సమస్యలు ఎదురైనా హనీమూన్ మధ్యలోనే అంతమౌతుంది.  

అదే హనీమూన్  కొత్తగా ఎన్నికైన రాజకీయ నాయకుల విషయంలో ఆరు నెలలుంటుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలల సమయం వరకు సత్ఫలితాలకోసం మామూలుగా అయితే వేచి చూడాలి.  కానీ ఒక నెలలోనే దేశానికి కావలసినంత నష్టాన్ని మోదీ కలుగజేసారని, అందువలన ఇక చాలు మీ హనీమూన్, తిరిగి వెనక్కి రండని నరేంద్ర మోదీకి జోగి పిలుపునిచ్చారు.

మూలుగుతున్న సామాన్యమానవుడి మీద తాటికాయ వేస్తూ రైల్వే రేట్లను పెంచేసారని, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు.  విదేశీ పెట్టుబడులను రక్షణ శాఖలాంటి కీలకమైన విభాగాలలో ప్రవేశపెట్టటం వలన దేశాన్నే అభద్రతకు లోను చేస్తున్నారని కూడా ఆయన అన్నారు.  మొత్తం మీద మోదీ ఎన్నికల సమయంలో తాను చేసిన వాగ్దానాలకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని జోగి అభిప్రాయపడ్డారు.  

ఛత్తీస్ గఢ్ లోని భాజపా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని, 56 లక్షల కుటుంబాలకు జారీచేసిన రేషన్ కార్డ్ లు 70 లక్షలని ఆరోపించారు.  

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని విమర్శించిన అజిత్ జోగి పరిస్థితులను సరిచెయ్యటం కోసం మోదీని హనీమూన్ ని అంతంచేసి తిరిగి రమ్మని పిలుస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles