Amit shah as new bjp president

amit shah to be new bjp president, bjp new president amit shah, amith pshah, pm narendra modi, bjp government, rajnath singh, modi government.

amit shah as new bjp president

అమిత్ షాతో పాత్రలు తారుమారు

Posted: 06/24/2014 11:27 AM IST
Amit shah as new bjp president

మోదీ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన రాజ్ నాథ్ సింగ్ హోం మంత్రిగా ప్రభుత్వంలో అధికారం చేపట్టటంతో భాజపాకి అధ్యక్ష హోదాలో ఎవరు పనిచేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

అయితే ఆ స్థానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు, ఎన్నికల ప్రచార సమయంలో మోదీకి వెన్నుదన్నుగా నిలిచిన అమిత్ షా అలంకరిస్తారనే వార్త బాగా వినపడుతోంది. మోదీ కోరుకునేదాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆశించిన ఫలితాలు వచ్చేట్టుగా చెయ్యగలిగేది ఒక్క అమిత్ షా అని పార్టీలోని వారందరికీ తెలుసు కాబట్టి పార్టీ అధ్యక్ష పదవిని అమిత్ షాకి కట్టబెట్టటానికి మోదీ వ్యూహరచన చేస్తున్నట్లుగా పార్టీలో వినపడుతోంది.

పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ తరఫున అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి ఏకత్రాటి మీద నడిచినప్పుడే పనులు సజావుగా సాగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మోదీ రాజకీయాలలో తనకు బాగా నమ్మకమైన అమిత్ షాని ఆ పదవిలో కూర్చోబెడతారని అనుకుంటున్నారు.

అయితే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినదానికి వ్యతిరేక దిశలో సాగవచ్చు. అక్కడ పార్టీ అధ్యక్షురాలు ఎదురులేని శక్తిగా పనిచేస్తే ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ చేష్టలుడిగి అణిగిమణిగి ఉండేవారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని సిబ్బంది కూడా ముందు సోనియా గాంధీతోనే అన్ని విషయాలను చర్చించేవారని కూడా బయటకు వచ్చింది.

ఇక్కడ మోదీ విషయంలో ఆయన చాల శక్తివంతమైన నాయకుడు కనుక ఆ విధంగా జరగే అవకాశం లేదు కానీ మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడు కనుక అమిత్ షా పాత్ర సోనియా గాంధీ పాత్రకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండబోతోంది. అందువలన పార్టీ మీద మోదీ పట్టు ఉంటుంది కానీ ప్రధాని మీద పార్టీ పట్టు ఉండబోదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp demands inquiry into ys sharmila assets
Lagadapati tries to confront chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles