Lagadapati tries to confront chandrababu naidu

lagadapati rajagopal, vijayawada mp, trying to meet chandrababu, tdp president, vastunna mee kosam padayatra, police held, budamaneru bridge

lagadapati rajagopal, vijayawada mp, trying to meet chandrababu, tdp president, vastunna mee kosam padayatra, police held, budamaneru bridge

Lagadapati Tries To Confront Chandrababu Naidu.png

Posted: 02/03/2013 04:01 PM IST
Lagadapati tries to confront chandrababu naidu

mp-lagadapatiక్రిష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు సమైక్యాంద్ర పై కనువిప్పు కలిగిస్తానంటూ హంగామా చేస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బాబు పాదయాత్రలో ఇవాళ హల్ చల్ చేసి సీన్ క్రియేట్ చేశారు.  లగడపాటి పలువురు విద్యార్థులతో కలిసి బిఆర్‌టిఎస్ రోడ్డు నుండి బాబును కలిసేందుకు బయలుదేరారు. అతనిని పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుడమేరు వంతెన వద్ద అడ్డుకున్నారు. పోలీసులు లగడపాటిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విద్యార్థులు భారీ ర్యాలీగా రావడంతో ట్రాఫిక్ జాం అయింది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు పోలీసులు లగడపాటిని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు. ఆయనను మరొకచోటుకు తరలించారు. బాబు అనుమతిస్తేనే తాను తెలంగాణపై నిర్ణయం మార్చుకోవాలని తాను లేఖ ఇస్తానని లగడపాటి పోలీసులు, టిడిపి కార్యకర్తలతో చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.కాగా విద్యార్ధుల ర్యాలీ కారణంగా వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం కలిగింది. మరి లగడపాటి చంద్రబాబును కలవాలన్న కోరిక నేడు కూడా తీరలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles