Cm kcr on fee reimbursement new policy in telangana state

kcr on fee reimbursement new policy, ="telangana government, new policy on fee reimbursement in telangana state, new fee reimbursement policy for telangana students, cm kcr on fee reimbursement new policy, nativity for fee reimbursement in telangana state.

Cm kcr on fee reimbursement new policy in telangana state

నాన్న... ఎక్కడ పుట్టావ్? పిల్లల క్వశ్చన్

Posted: 06/23/2014 01:44 PM IST
Cm kcr on fee reimbursement new policy in telangana state

ఇప్పుడు తెరపైకి విచిత్రమైన ప్రశ్న ఒకటి వచ్చింది. ఈ ప్రశ్నతో తెలంగాణ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. కేసిఆర్ సర్కార్ కొత్త చట్టం తీసుకురాబోతున్న తరుణంలో తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ లో కేసిఆర్ సర్కార్ కొత్త అడుగులు వేస్తున్న సమయంలో.. కొన్ని వింత నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరికి రాని ఆలోచనతో సరికొత్తగా ముందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ అన్ని ప్రాంతాల విద్యార్థులకు, అన్ని కులాల వారికి అందే విధంగా ప్రతిపాదన చేయటం జరిగింది. అదే విదంగా అమలు జరిగిన విషయం తెలిసిందే. అయితే కేసిఆర్ సర్కార్ మాత్రం కొత్త ఆలోచనతో.. తెలంగాణ విద్యార్థులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించే ఫీ రీఎంబర్స్ మెంట్ పాలసీలో విద్యార్థి స్థానికతను . విద్యార్థి తండ్రి ఇంటర్ నుంచి ఏడేళ్లు నాన్ స్టాప్ గా ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి లోకల్ అవుతారనే నిబంధన వుండేది. కానీ ఇప్పుడు తెలంగాణ లలో అలా కాదు. విద్యార్థి తండ్రి పుట్టిన ప్రాంతం ఆధారంగా ఫీజ్ రీఎంబర్స్ మెంట్ అమలు చేసే విధంగా కేసిఆర్ సర్కార్ సరికొత్త అడుగులు వేస్తుంది.

kcr-government

 

దీంతో..తెలంగాణ విద్యార్థలు.. ‘‘నాన్న ఎక్కడ పుట్టావ్ ’’అంటూ తల్లిదండ్రులను విద్యార్థులు అడిగే రోజలు తెలంగాణ వస్తున్నాయి. దీంతో తెలంగాణ విద్యార్థులకు పూర్తి న్యాయం జరుగుతుందని ..తెలంగాణ మంత్రులు, తెలంగాణ నేతలు, అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం త్వరగా అమలు జరిగితే బాగుటుందని కేసిఆర్ కు తెలంగాణ మంత్రలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ లోని కొంతమంది ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తండ్రి ఉద్యోగి రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉండి.. అక్కడ సంసారం చేసి పిల్లలను కంటే వారు తెలంగాణ బిడ్డలు కాదా? ఆ బిడ్డలకు పెళ్లైయితే పిల్లలు పుడితే వారు తెలంగాణ గడ్డమీద పుట్టినట్టు కదా? అని తెలంగాణలోని కొంత మంది ఉద్యోగులు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ..ఒక తరం ప్రజలు పూర్తిగా నష్టపోతారని తెలంగాణ మేథావులు అంటున్నారు. తండ్రి ఆంద్రలో పుట్టి, తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకోని హైదరాబాద్ లో స్థిరపడిపోయిన వారి సంగతి ఏంటి? అలాగే ఆంద్ర అబ్బాయిని తెలంగాణకు ఇల్లారికం తెచ్చుకున్న కుటుంబాల సంగతి ఏమిటి? అంతేకాకుండా 70, 60, 50, సంవత్సరాల నుండి తెలంగాణలో స్థిరపోయిన ఇతరా రాష్ట్రాల ప్రజలు చాలా మంది ఉన్నారు. మరీ వారి కుటుంబాలు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదా? అని నగరంలోని కొన్ని కుటుంబాలు కేసిఆర్ సర్కార్ పై మండిపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles