We too can cut water ap ministers harish rao

harish rao, telangana, ppa, andhra pradesh, chandrababu naidu

Telangana state minister for major irrigation Harish Rao, accused TDP president Chandrababu Naidu of trying to politicize the Beas tragedy

మీరు కుట్ర చేస్తే...మేం కట్ చేస్తాం : హరీష్

Posted: 06/22/2014 11:42 AM IST
We too can cut water ap ministers harish rao

తెలంగాణ రాష్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు, ఆంధ్రప్రదేశ్ మంత్రులను తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ పై ఆధిపత్యం కోసం చంద్రబాబు నాయుడు కరెంటు కట్రలు చేస్తే మేం  కూడా అదే రీతిలో సమాధానం చెప్పవలసి వస్తుందని, వారు కరెంటు కొరత తెప్పిస్తే హైదరాబాద్ లో ఉన్న బాబు గారికి, మంత్రుల క్వార్టర్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపి వేస్తామని హెచ్చరించారు. 

పీపీఏ రద్దు చేసుకోవాలనుకుంటున్న ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత పెట్టుబడి రూ.15000 కోట్లు ఉన్నాయని, 2009 నుంచి పీపీఏలు లేనప్పుడు తెలంగాణ ప్రజల నుంచి బిల్లులు ఎలా వసూలు చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొరత ఏర్పడేందుకు కుట్రలు పన్నితే హైదరాబాద్‌లో ఏపీ ఆఫీసులకు కరెంటు కోతలు తప్పవన్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకోవడానికి ముందు నుంచే ఈ గేమ్ ఆరంభించారని తెలంగాణ ప్రభుత్వంపై డామినేట్ చేయాలన్న తాపత్రయంలో ఆయన ఉన్నారని, దానికి తగు సమాధానం చెప్పవలసి ఉంటుందని హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్ తమ నియంత్రణలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము సామరస్యంగా పోవాలని ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు ప్రతిదానిని వివాదం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి , మంత్రులు హైదరాబాద్ లో ఉంటున్నందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి కాదని ఏపీ ప్రజలు అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles