తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ..కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు హమీలు ఇస్తే.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. తెలంగాణ పోలీసులకు .. ఇప్పటికే వీకెంట్ సెలవులు ఇవ్వటం మొదలుపెట్టారు. తెలంగాణ రైతులకు అభయం హస్తం ఇవ్వటం జరిగింది.
అయితే కొత్త తెలంగాణ రాష్ట్రంలో పని పోలీసులు అర్జెంటుగా రంగు మార్చండని ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పనితీరును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ పోలీసులకు కేసిఆర్ వరాల జల్లు కురిపించారు.
1650 ఇన్నోవాలు, అవసరం మేరకు టూవీలర్లు కొనుగోలు చేయాలని కేసీఆర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది డ్రెస్ కోడ్‌ను పూర్తిగా మార్చాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ జంటనగరాలు అంతా కవరయ్యేలా సీసీ కెమరాలు తక్షణం అమర్చండని కేసీఆర్ అధికారులకు తెలిపినట్టు సమాచారం. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో 'అధునాతన టెక్నాలజీని వాడుతూ న్యూయార్క్ తరహా పోలీసింగ్‌ను నిర్వహించాలి' అని కేసీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ తో , హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more