Modi governement rail passenger charges increased 14 percent

Railway passenger fare hiked, Prime Minister Narendra Modi, PM Modi-s rail shocker Passenger, India, narendramodi pm, sadanandagoda railway minister, Railway ticket charges increased 14 percent, freight fares increase, fdi allow in railwayPassenger fares- freight rates hiked, Railway Ministry has hiked passenger, Indian Railways, Rail passenger fare, Rail passenger fare hike, passenger fare hike

PM Modi-s rail shocker Passenger fares- freight rates hiked, Indian Railways, Rail passenger fare, Rail passenger fare hike, passenger fare hike

మోదీ వాత-గౌడ్ ఛార్జీల కూత?

Posted: 06/20/2014 05:31 PM IST
Modi governement rail passenger charges increased 14 percent

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూకుడు ప్రయాణికుల కొంపముంచింది. ‘‘మంచోడు కదా అని ..మంచ ఇస్తే.. మంచి నిండా ..ఏదో చేసాడాట. అదే బాటలో మన మోడీ సర్కారు ప్రయాణిస్తూంది. కొత్త పెళ్లి కొడుకు పొద్దు ఎరగడనట్లు .. నరేంద్ర మోదీ పోకడ అలాగే ఉంది. అనుకున్నట్లుగానే రైలు ఛార్జీలు పెరిగాయి

. ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం చొప్పున, సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ వస్తుండటం, అలాగే రైల్వే మంత్రి సదానంద గౌడ కూడా రైలు ఛార్జీల పెంపు గురించి ప్రస్తావిస్తుండటం తెలిసిందే.

అందుకు అనుగుణంగానే రైలు ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు తక్షణం అమలులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల ఛార్జీలు ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడూ పెరగలేదు. అటు రవాణాతో పాటు ఇటు ప్రయాణికుల ఛార్జీలను కూడా భారీగా పెంచారు.

Railway-ticket-charges-increased

 

కాగా.. రైల్వే బోర్డు ప్రతిపాదించిన మేరకు సరిగ్గా అంతే శాతం చొప్పున ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాను 6.5 శాతం చొప్పున పెంచడం గమనార్హం. దీంతోపాటు రైల్వేలలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్ డీఐ)లకు కూడా పచ్చజెండా ఊపాలని సదానందగౌడ భావిస్తున్నట్లు తెలిసింది.

ప్రధానంగా డీజిల్ ధరలు గణనీయంగా పెరగడం, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో ఛార్జీల పెంపు తప్పలేదని అంటున్నారు. గతంలో రైలు ఛార్జీలను పెంచినప్పుడు ఏకంగా తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రితో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా కూడా చేయించారు. ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles